Singer Sunitha: సునీత ఉపద్రష్ట పేరు కాలక్రమేణా సింగర్ సునీతగా పేరు గాంచింది. ఆమె జీవితం ఓ తెరిచిన పుస్తకం. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా బాధ్యతలు వహించిన సునీత 15 సంవత్సరాల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గాయనిగా ప్రవేశించింది. తరువాత కాలంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి, అనేకమంది తెలుగు కథానాయికలకు తన గాత్రదానం చేసింది.
Singer Sunitha: సునీత డబ్బింగ్ చెప్పిన సినిమాల సంఖ్య:
ప్రస్తుతం ఆమె సుమారు 800 సినిమాలకు పైగా డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసిందని సమాచారం. మొదట్లో ఆమెకు గులాబి, ఎగిరే పావురమా సినిమాలు గాయనిగా మంచి పేరు తెచ్చిన చిత్రాలు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ మల్టి టాలెంటెడ్ అని నిరూపించుకుంది. టాలెంట్ తో పాటు సుమనోహరమైన అందం ఆమె సొంతం. అందుకే ఓ టైంలో ఆమెకు సినిమా నటిగా కూడా అవకాశాలు వచ్చాయి. అయితే కేవలం పాటలకే తన జీవితాన్ని అంకితం చేసిన సునీత ఆ అవకాశాలను మృదువుగా తిరస్కరించారు.
Deepti Sunaina : గృహప్రవేశం చేసిన షణ్ముఖ్.. షన్ను పక్కన వున్నది ఎవరబ్బా!
సునీత పాడిన పాటలు సంఖ్య ఇదే..
ఇప్పటివరకు సునీత దాదాపు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో కలుపుకొని సుమారు 3,500 పైగా సినిమా పాటలు పాడిందని భోగట్టా. ముఖ్యంగా ఇక్కడ ఓ పాట గురించి ప్రస్తావించాలి. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన “ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” అనే పాట సునీత కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా అశేషాభినులను అలరించింది.