Architecture: ఇంటి యజమానితో పాటుగా
సొంతఇల్లయినా, అద్దె ఇల్లయినా వాస్తురీత్యా ఉంటేనే మనకు అన్నివిధాలా మంచిది.వమనం ఉండే ఇల్లు సొంతమైనది కాక పోయిన అద్దెకు వెళ్ళాక అందులో ఉన్న దోషాలను ,లేదా మంచిని ఆ ఇంటి యజమానితో పాటుగా పంచుకోనవలసిందే.
కొందరికి అద్దె ఇళ్ళు మారి మారి విసుగొస్తూఉంటుంది. ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాం అంటూ బాధ పడిపోతుంటారు. మీకు సొంత ఇల్లు కల నెరవేరాలంటే మీరు ఉంటున్నా అద్దె ఇంటి వాస్తూకూడా బాగుండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఉంటున్న ఇల్లు గ్రామంలో ఉన్న నగరంలో ఉన్న వాస్తురీత్యా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది గుర్తు పెట్టుకోండి. కాబట్టి అద్దె ఇంటిలో కి వెళ్లేముంది అలోచించి అడుగు వేయాలి. అద్దె ఇంటికి వెళ్లే ముందు ముఖ్యం గా గమనించవలిసింది ఏమిటంటే.. నైరుతి, దక్షిణ, పశ్చిమాలలో మాస్టర్ బెడ్రూమ్ ఉందోలేదో అనేది గమనించుకోవాలి.
Architecture: గుండ్రం గా మాత్రం
ఆగ్నేయంలో మాత్రమే వంట గది ఉండాలి. ఈశాన్యంలో ద్వారం, గృహం మధ్యన ఖాళీ ఉండటం ప్రదానం. నైరుతిలో బాల్కనీ ఉండకూడదు. ఇల్లు దిక్కులకు తగ్గట్టుగా ఉండాలి. ప్రతి పోర్షన్ చదరంగాకానీ దీర్ఘ చతురస్త్ర ఆకారంలో కానీ ఉండడం అన్నివిధాలా మంచిది. గుండ్రం గా మాత్రం ఉండకూడదు. నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు.ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు తగ్గట్టు ఉన్నాయో లేవో చూసుకోవాలి. చెడు చేసే వీధి వీధిపోట్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. చీకటిగా ఉండి గాలి, వెలుతురురాని ఇల్లు, రోడ్డు నుంచి బాగా పల్లంగా ఉన్న ఇళ్ళు మంచివికావు అని చెప్పబడింది. టాయ్లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది.
ఇంటిలో దిగే ముందుగానే
ఇంటిలో దిగే ముందుగానే ఇంట్లో గోడలు శుభ్రంగా రంగులు వేసి ఉన్నాయా?మురికిపట్టి ఉన్నాయా ?ట్యాప్ లు ఏమైనా లీక్ అవుతున్నాయా?ఎక్కడైనా గోడలు కానీ నేల కానీ పగుళ్లు ఉన్నాయా ? కిటికీ అద్దాలు పగిలి ఉన్నాయా ?అనేవిషయాలు బాగా గమనించుకుని అవేమి లేకున్నా ఉన్న ఇల్లు అద్దెకు తీసుకోవడం మంచిది.