కీర్తి అకౌంట్ లో సినిమాలు ఎక్కువయ్యానే రిలీజ్ అనుకున్న సినిమాని అలా వదిలేశారా ..?

కరోనా లాక్ డౌన్ లో ఓటీటీ ద్వారా బాగా క్రేజ్ ఉన్న సినిమా రిలీజైందంటే అది కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా. ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీగానే ప్రమోషన్స్ చేశారు. 35 రోజుల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేయడం కూడా గొప్ప విషయం. ఇక ఈ సినిమాతో కీర్తి సురేష్ చేసింది పెద్ద సాహసమే. అందరికంటే కీర్తి కే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. రిజల్ట్ విషయం పక్కన పెడితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కీర్తి పర్‌ఫెక్ట్ అని పెంగ్విన్ తో మరోసారి నిరూపించింది.

Tollywood: Keerthy Suresh's Miss India to release directly on Netflix

దాంతో ఇలా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ అయిన గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా సినిమాలు కూడా ఓటీటిలో వచ్చేస్తాయని అందరూ చెప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకడుగు ముందుకేసి మిస్ ఇండియాకి ప్రముఖ ఓటీటి నుంచి భారీ ఆఫర్ వచ్చిందని త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మిస్ ఇండియా సినిమాకి ఏ ఓటీటీ సంస్థ తో డీల్ సెట్ కాలేదని అవన్ని అవాస్తవలని మేకర్స్ చెప్పుకొచ్చినట్టు తెలిసిందే.

అయితే ఇప్పుడు అందరు ఈ సినిమా గురించి కొత్త రూమర్ ని స్ప్రెడ్ చేస్తున్నారట. అదేమిటంటే ఈ సినిమాని మొత్తంగా వదిలేశారని. ఓటీటీ లోగాని థియోటర్స్ లో గాని రిలీజ్ చేస్తామన్న క్లారిటి మేకర్స్ నుంచి రాకపోవడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. వాస్తవంగా చూస్తే అది నిజమే. పెంగ్విన్ సినిమా కంటే ముందే మిస్ ఇండియా మొదలైనప్పటికి ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటన్నది తెలియడం లేదు. కీర్తి కూడా ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడం లేదు. మరి మేకర్స్ ప్లాన్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. కాగా ఇటీవలే కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట లో హీరోయిన్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.