God Photo: మీ ఇంటి ప్రధాన ద్వారం మీద బయటపక్కకు కనబడేలా దేవుడి ఫోటో పెట్టుకున్నారా?? వెంటనే ఇలా చేయండి!!

Share

God Photo: మనం ఉండే   ఇంటి ముఖం ద్వారం అయినా ప్రధాన గుమ్మంపై బయటపక్కకు  ఉండే  దర్వాజా ఫ్రేం పైన  ఎటువంటి  దేవుని  ఫొటోస్ లేకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి. అదే గుమ్మం లోపల పై భాగాన మాత్రం  గోమాత సమేత ఐశ్వర్యకాళీ అమ్మవారు పాదాలు కానీ , వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, గోమాత  ఫోటో కానీ పెట్టుకోవచ్చు. బయట వైపు  కనిపించే ఇంటి ప్రధాన ద్వారం మీద  స్వస్తిక్ గుర్తు తో పాటు  ఓంకారం, కలశం లాంటి గుర్తులు ఉంచుకోవచ్చు. ఇలా  చేస్తే కూడా ఇంటిలో ఉన్న  వాస్తు లోపం  పోతుంది.  దింతో పాటు  సూర్యాస్తమయం  అవగానే ఇంటి ప్రవేశ  ద్వారం  దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం. వాస్తు  దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని  మాత్రమే అమర్చుకోవాలి.  లోహపు ద్వారాలు  పెట్టుకోవడం అనేది మంచిది కాదు.

అలాగే  ప్రతి రోజు  ముఖ్యంగా ఇంటి ప్రధాన గుమ్మానికి ఉన్న గడపకు   పసుపు రాసి,  కుంకుమ బొట్లు  పెట్టి ,బియ్యం పిండితో   ముగ్గులు వేసి అలంకరించుకోవాలి.    ప్రతిరోజూఇంటి వాకిట్లో కల్లాపి  వేసి  ముగ్గు వేయాలి. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా  ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో  పగిలిపోయిన , విరిగిన వస్తువుల ను ఉంచుకోకూడదు. పక్కబట్టలు వారానికి ఒక సారిఉతుక్కోవాలి. సోఫా కవర్స్, కర్టేన్స్,  వంటివి  కనీసం రెండు వారాలకు ఒక సారి  శుభ్రం  చేయాలి. అలాగే ఇంట్లో పనికిరాని ఉపయోగం లేని వస్తువులను ఎట్టి పరిస్థితులలో ఉంచుకోకూడదు.

అదేవిధంగా కనీసం  నెలకు ఒక్కసారైనా బూజు  దులుపుకోవడం,కిటికీలు వాటి గ్లాసులు శుభ్రం చేసుకోవడం వంటివి చేసుకోవాలి. పాత న్యూస్ పేపర్లు,  వాడని  సీసాలు, డబ్బాలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి.   కనీసం  వారం లో  ఒక్క సారైనా బకేట్ సగం నీళ్ళలో నేల శుభ్రం చేసుకునే  లిక్విడ్ తో పాటు  కల్లుప్పు దీన్నే దొడ్డుప్పు అనికూడా అంటారు… అది కొంచం డెటాల్ కొంచెం  వేసి  ఇంటి నేలను శుభ్రం చేసుకోవాలి.  బాత్రూము లలోకి కాస్త  గాలి, వెలుతురు  వచ్చే విధం గా  ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజూ బాత్ రూములను సర్ఫు తో శుభ్రం చేసుకుని , డెటాల్ లేదా ఫినాయిల్ వేసి   ఉంచుకోవాలి.   ఇంట్లో ఉన్న అన్ని తలుపులు , కిటికీలను రోజులో కొన్ని గంటల పాటు   బాగా  తెరచి పెట్టి  గాలి   వెలుతురూ లోనికి వచ్చే విధం గా చేసుకోవాలి.


Share

Related posts

Job Notification: ఐఐటీఎం పూణేలో 156 ఖాళీలు..!!

bharani jella

గ్రేటర్ లెక్కింపుపై రచ్చ..! ఈసీ నిర్ణయంపై కోర్టుకెళ్లిన బీజేపీ

somaraju sharma

బిగ్ బ్రేకింగ్ : కరోనా పాజిటివ్ రాగానే అమితాబ్ చెప్పిన మాటలివే….

arun kanna