Diet: డైట్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్తే ఈ స్నాక్స్ తినండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం !!

Share

Diet:  డైట్  లో ఉన్నప్పుడు  గుర్తుకు రాగానే  ఎక్కువ నూనె, ఎక్కువ కేలరీలు మన కళ్ళముందు  కనబడతాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం  ఏమిటంటే,  స్ట్రీట్ ఫుడ్ లో కూడా ఆరోగ్యకరమైనవి  ఉన్నాయి .  అవి  మీ డైట్ ని పాడు చేయకుండా  మీ వెయిట్ లాస్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత హెల్ప్ చేస్తాయి.  ఆ ఫుడ్ గురించి తెలుసుకుందాం.

పన్నీర్ టిక్కా

తందూరి పన్నీర్ టిక్కా మొదలు    మసాలా పన్నీర్ టిక్కా వరకు ఏదైనా లాగించేయొచ్చు  . ఎందుకంటే పన్నీర్ టిక్కా చాలా తక్కువ  నూనెతో ఫ్రై చేస్తారు. కొన్నిసార్లు అలా కూడా చేయకపోవచ్చు. పెరుగుతో కలుపుకుని మసాలా దట్టించి తయారు చేసుకున్న పన్నీర్ టిక్కా పుదీనా చట్నీతో తింటే టేస్ట్ కి ఆహా అనాల్సిందే.

భేల్ పూరీ

భారతదేశమంతటా మహారాష్ట్రకు చెందిన భేల్ పూరీ అందుబాటులో ఉంటుంది. పేలాలు, ఉల్లి, నిమ్మరసం, చింత చట్నీ కలిపి ఉండే భేల్ పూరీ  లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి   ఈ ఫుడ్ ఎంచక్కా    తినవచ్చు.

మసాలా మొక్కజొన్న

ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలకి మసాలా దట్టించి   నిమ్మరసం  వేసుకుని ,    చినుకులు చూస్తూ వేడి గింజలు నోట్లో వేసుకుంటుంటే నోటికి తగిలే వెచ్చని వేడి మెదడుకి  మంచి ప్రశాంతతను కలిగిస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన ఈ చిరుతిండి హాయిగా, ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.వేరు శెనగల చాట్: ఉడికించిన వేరుశనగ,  ఉల్లిపాయలు,  కొత్తిమీర, టమాటా,నిమ్మకాయ తో పాటు కలిపి చేస్తారు  ఇది చాలా రుచిగా ఉంటుంది.  కూరగాయల నుండి వచ్చే ప్రోటీన్లు మరియు ఫైబర్ ఎక్కువగా లభించే   మంచి స్నాక్ ఇది


Share

Related posts

AP CM YS Jagan: మహిళా భద్రతా చర్యలపై సీఎం జగన్ కీలక సూచనలు

somaraju sharma

RRR : ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ చూస్తే నోట మాటరాదంతే..?

GRK

Thaman : థమన్ కి బాలీవుడ్ ఆఫర్స్..నో అన్న మ్యూజిక్ సెన్షేషన్

GRK