NewsOrbit
న్యూస్

నిజమెంత: లల్లూ ప్రసాద్.. జయలలిత.. వైఎస్ జగన్!?

కొంతమంది రాజకీయ నాయకులు.. సారీ, “మాజీ” రాజకీయ నాయకులు.. మరింత మర్యాదగా చెప్పాలంటే “రాజకీయ నిరుద్యోగులు” అనబడేవారు… వారి వారి రాజకీయ “పబ్బం” గడుపుకోడానికో.. ఈ రిటైర్మెంట్ సమయంలో కాసేపు టీవీలో కనబడి కాలక్షేపం చేయడానికో.. పొద్దున లేవగానే పేపర్లో ఫోటో చూసుకునే అలవాటు మానుకోలేకనో.. చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు అనేది జగమెరిగిన సత్యం!! కొన్ని రోజుల క్రితం సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు తాజా ఉదాహరణ.. పైన చెప్పుకున్న రాజకీయ నాయకుడికి కూడా ఈయన ఉదాహరణే!

వివరాళ్లోకి వస్తే… 2022 లో జగన్ కుర్చీ దిగిపోతారు… కానీ వైఎస్సార్సీపీ తో ఏపీ ప్రభుత్వం నడుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు సబ్బం హరి! ఇంతకు మించిన టైం పాస్ అవ్వక చెప్పే మాటలు, రచ్చబండ రాజకీయ కబుర్లు మరొకటి ఉండదు అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఆమాటలు నిజమనుకుని ప్రతిపక్షం ఫీలయితే పరిస్థితి ఏమిటి అన్నది ఇక్కడ హాట్ టాపిక్! ఇప్పటికే అత్యంత బద్దకంగా తయారయ్యిందన్న విమర్శను ఎదుర్కొంటున్న టీడీపీని మరింత నిద్రావస్తలోకి నెట్టే పనిగా దీన్ని చూడాలా.. లేక రాజకీయంగా తన మనుగడ కాపాడుకోవడం కోసం.. కనీసం కొన్ని మీడియా ఛానల్ లో అయినా కనబడటం కోసం హరి చేసీన తాపత్రయంగా వీటిని చూడాలా?

ఆ సంగతులు అలా ఉంటే… జగన్ 2022 కి సీఎంగా ఉండరనేది “తన అభిప్రాయం” అంటూనే… “తనకున్న సమచారం” అన్నారు సబ్బం హరి! “అభిప్రాయం” అయితే… అంతా లైట్ తీసుకోవచ్చు! కానీ… “సమాచారం” అంటే దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి! గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలితల విషయంలో జరిగినట్లు జరుగుతుందనేది హరి ఫీలింగా లేక సమాచారమా అంటే… అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండకపోవచ్చు!

లల్లూ ప్రసాద్ యాదవ్.. జయలలితలపై కేసులు అనేవి వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వచ్చినవి కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకుని వారిపై చర్యలు తీసుకోవడం జరిగింది.. అది గతం! కానీ… తాను ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ లేనిరోజుల్లో కేవలం ముఖ్యమంత్రి కొడుకు హోదాలో పెట్టబడిన కేసులు జగన్ పై ఉన్నాయి… ఇదే సమయంలో ప్రతీ శుక్రవారం కోర్టుకి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయన అనుమతులు పొందుతున్నారు!! ఆ కేసుల్లో ఉన్న బలమెంత అనేది నాటి కాంగ్రెస్ పెద్దలను వ్యక్తిగతంగా అడిగితే చెప్పే సమాధానం ఆశ్చర్యపరుస్తుంది కూడా. అలాంటి పరిస్థితుల్లో… జయలలిత, లల్లు ప్రసాద్ లను ఉదాహరణలుగా చూపిస్తూ పైన చెప్పుకున్న అర్హతలున్న కొందరు చేసే విశ్లేషణలను ఏమనాలి?

రాత్రి నిద్రలో కలొచ్చిందనుకోవాలా, లేక మతిభ్రమించిన తాలూకు వ్యాఖ్యలు అనాలా లేక జగన్ తిరుగులేని నాయకత్వాన్ని చూసి తగులుకున్న మానసిక క్షోభ అని సరిపెట్టుకోవాలో సామాన్యుడికి అర్ధం కాని పరిస్థితి. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని అందుబాటులో ఉన్న మానసిక వైద్యశాలకు తరలించడం మినహా మరో ఆప్షన్ లేదనేది “ఏపీ కొత్త రాజధాని” ప్రజల మాట! రాజకీయాల్లో ప్రతిపక్షాల నుంచి విమర్శలు అవసరం.. కాదు నిత్యావసరం కూడా! కానీ… పగటి పూట వచ్చే కళలు.. మైకంలో వచ్చే మాటలు.. ట్రిక్కుల కోసం చెక్కుల కోసం చెప్పే మాటలు ప్రజలపై రుద్దడం ఏమాత్రం సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju