NewsOrbit
న్యూస్

రైతుల కోసం డిజిటల్ స్టూడియో అంట..! ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

Share

 

 

సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి కొత్త పుంతనాలు తొక్కుతున్న తరుణంలో, వ్యవసాయక రంగంలో కూడా ఎన్నో కొత్త పద్ధతులు ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ వ్యవసాయక పరిజ్ఞానాన్నీ ప్రతి రైతు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమలులోకి తీసుకు వస్తుంది.

 

దీనికోసం విజయవాడలో త్వరలో వ్యవసాయేతర డిజిటల్ స్టూడియోను ప్రారంభించాలి అనే యోచనలో ఉంది. ఈ డిజిటల్ స్టూడియో ద్వారా విడుదల చేసే వివిధ కార్యక్రమాల సహాయంతో వ్యవసాయంలో ఉపయోగించే తాజా సాంకేతిక పరిజ్ఞానాలు అలాగే వ్యవసాయ చిట్కాలను, నిపుణుల అభిప్రాయాలు, సూచనలను మరియు తాజా పంట రకాలతో రైతులకు ప్రయోజన సంబంధిత విషయాలను అలాగే ఏ సీజన్లో ఏ పంటను నాటాలి, ఏ పంటను నాటడం వాళ్ల ఎంత దిగుబడి వస్తుంది, నేల సంతానోత్పత్తి పరీక్షలు మొదలైన వాటిపై జ్ఞానాన్ని ఈ డిజిటల్ సమావేశాల ద్వారా వ్యవసాయదారులు వాళ్ల గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా తెలుసుకొవచ్చు. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఈ కేంద్రాలు ద్వారా ఖరీఫ్ సీజన్లో రైతుకి అవసరం అయినా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంపై సమాచారాన్ని రైతన్న తెలుసుకుంటున్నాడు. ఆధునిక వ్యవసాయం గురించి రైతులు తెలుసుకోవడానికి ఆర్‌బికెలు ఉపయోగపడుతున్నాయి.

మన ప్రభుత్వం ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహాయంతో రైతులకు సొంతంగా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి వీలుగా విత్తన గ్రామం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా అందించబడిన జ్ఞానంతో, రైతులు స్వయంగా అధిక నాణ్యత గల విత్తనాలను తయారు చేస్కోగలుగుతారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించే వ్యవసాయ పంచాంగంలో రైతులు మార్కెటింగ్ పద్ధతులు, కాలానుగుణ సాగు, నేల పరీక్ష, కొత్త పంట రకాలు గురించి వివరణ ఈ వ్యవసాయ పంచాంగం లో రైతన్నలకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా ప్రచురించారు. రైతు భరోసా కేంద్రం నుండి వ్యవసాయదారులు వ్యవసాయ క్యాలెండర్లని పొందవచ్చు.


Share

Related posts

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

somaraju sharma

Coffee: కాఫీ తాగుతున్నారా.. ఇవి తెలుసుకోవాల్సిందే..!!

bharani jella

నువ్వు బ్రహ్మానందం అయితే.. హైపర్ ఆది ఇక్కడ.. తొందరపడి బ్రహ్మానందాన్ని అంత మాట అన్న ఆది

Varun G