NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేస్ నుండి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్ .. ఖర్గే – శశిథరూర్ ల మధ్యే పోటీ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వరకూ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు మద్య నే పోటీ ఉంటుందని, ఈ రోజు వీరు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కూడా తమ మధ్య స్నేహపూర్వక ఫోటీగా భావిస్తున్నామని పేర్కొన్నారు. నిన్న ఏఐసీసీ కార్యాలయం నుండి నామినేషన్ పత్రాలు తీసుకున్న దిగ్విజయ్ సింగ్ ఆ తరువాత శశిథరూర్ నివాసానికి వెళ్లి కలిశారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత ఇది సహోద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ అని, ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లేనని శశిథరూర్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయానికే సీన్ మారిపోయింది. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో దిగ్విజయ్ సింగ్ పోటీ నుండి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ లు ఈ రోజు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

Shashi Tharoor Mallikarjuna Kharge

 

తొలుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన సీఎం పదవిని సచిన్ పైలట్ కు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే జోడు పదవులకు పార్టీ ఒప్పుకోకపోవడంతో తన వర్గీయుడికే సీఎం పదవి కట్టబెట్టాలని యోచన చేశారు. ఆ నేపథ్యంలో గెహ్లాట్ వర్గానికి చెందిన 90మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు స్పీకర్ కు సమర్పించారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ నిన్న సోనియా గాంధీని కలిసి రాజస్థాన్ లో జరిగిన పరిణామాలపై క్షమాపణలు చెప్పడంతో పాటు అధ్యక్ష బరి నుండి తప్పుకుంటానని, సీఎంగానే కొనసాగుతానని చెప్పారు. అంతకు ముందే దిగ్విజయ్ సింగ్ పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే బరిలో దిగుతున్నట్లు ప్రకటించడంతో దిగ్విజయ్ సింగ్ డ్రాప్ అయ్యారు.

Digvijay Singh

 

ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ..మల్లికార్జున ఖర్గే తనకు సీనియర్ అని, నిన్న ఆయన నివాసానికి వెళ్లానని, మీరు పోటీ చేస్తే తాను బరి నుండి తప్పుకుంటానని చెప్పానని తెలిపారు, అయితే తాను పోటీ పడటం లేదని ఆయన అన్నారనీ, అయితే అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి బరి నుండి తప్పుకున్నాను అని తెలిపారు. తాను ఖర్గేకి మద్దతుగా నిలుస్తాననీ, ఆయనకు ప్రతిపాదకుడిగా ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ కే పని చేశాననీ, చివరి వరకూ కాంగ్రెస్ తోనే ఉంటానని పేర్కొన్నారు దిగ్విజయ్ సింగ్. దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలవడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడటం, నెహ్రూ – గాంధీ కుటుంబానికి విధియుడిగా ఉండటం ఈ మూడు అంశాలలో తాను ఎప్పటికీ రాజీపడలేనని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!