కమల్ నాథ్ కేబినెట్ లో డిగ్గీరాజా కుమారుడు

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్దన్ సింగ్ కు కమల్ నాథ్ కేబినెట్ లో స్థానం లభించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు తన కేబినెట్ ను విస్తరించారు. మొత్తం 28 మంది మంత్రుల చేత ఆ రాష్ట్ర గవర్నర్ అనందిబెన్ పటేల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో దిగ్విజయ్ కుమారుడు జైవర్దన్ సింగ్ కూడా ఉన్నారు.

ఇటీవల జరిగిన మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కమల్ నాథ్, ఉపముఖ్యమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం కమల్ నాథ్ ఈ రోజు పూర్తి కేబినెట్ ను ఎంపిక చేసుకున్నారు. వారి చేత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు.

SHARE