ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఒకప్పుడు బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి లాంటి సినిమాలు దిల్ రాజు పై మరెన్నో అంచనాలు పెట్టుకునేలా చేసాయి.
అంచనాలన్నీ తప్పే
అయితే ‘శతమానం భవతి’ సినిమా తరువాత వచ్చిన శ్రీనివాస కళ్యాణం దారుణంగా ఫ్లాప్ అయింది. దీని తరువాత దిల్ రాజు మరెన్నో ఆశలు పెట్టుకొని నిర్మించిన సినిమా జాను. తమిళ్ లో 96 సినిమా చూసి, అక్కడ కొన్ని థియటర్స్లో సినిమా గురించి ఆడియన్స్లో స్పందన తెలుసుకొని, అక్కడి టీమ్ ని హైర్ చేసుకొని మంచి కాంబినేషన్ సెట్ చేసారు. ఇంత జాగ్రత్తపడ్డ ఫలితం మాత్రం దిల్ రాజు అనుకునట్లు రాలేదు. ప్రస్తుతం థాంక్యూ సినిమా పని కూడా అంతే అయింది. మంచి కాన్సెప్ట్ అని దిల్ రాజు బలంగా నమ్మారు. అంతే నమ్మకంతో ప్రచారం చేశారు. థాంక్యూ సినిమాకి అన్ని తానే వ్యవహరించారు. కానీ అనుకోని విధంగా థాంక్యూ మూవీ దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చింది.
ఆలోచనలు మార్చుకోవాల్సిందే
ఎక్కడో దిల్ రాజు ఆలోచనలు తప్పు అయ్యాయనే చెప్పాలి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దిల్ రాజు ఆలోచనలు మ్యాచ్ కావడం లేదా? లేక ఆయన నమ్మిన సబ్జెక్టు తప్పా? అనేది ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది దిల్ రాజుకు. కొన్నిసార్లు దిల్ రాజు తను పెద్ద మేధావి అని అనుకుంటాడు. కొత్త మార్గాల్లో వెళ్తూ ఉంటాడు. ఆ మార్గాలు సక్సెస్ అయితే పర్వాలేదు కానీ ఇలా బెడిసి కొడితేనే దిల్ రాజుపై ప్రేక్షకుల పెట్టుకున్న నమ్మకం కోల్పోతాడు.కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించి సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.