ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల హవా నడుస్తోంది. ఈ సినిమాలకి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు ఉత్తరాదిలోనూ హిట్స్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇటీవల దిల్ రాజు నిర్మించిన రెండు బాలీవుడ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న దిల్ రాజుకు ఇలాంటి షాక్ ఎప్పుడూ ఎదురుకాలేదు.
జెర్సీ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రాత్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ హిందీలో బోల్తా కొట్టింది. ఈ సినిమాని రూ.95 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీసు వద్ద కేవలం రూ.27.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ప్లాప్‌తో దిల్ రాజుకి దిమ్మదిరిగింది. మళ్లీ ఇంకో సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు. కానీ అది కూడా కోలుకోలేని షాక్ ఇచ్చింది.
మన దిల్ రాజు టీ సిరీస్ ఓనర్స్ భూషణ్ కుమార్, కృష్ణ కుమార్లతో కలిసి టాలీవుడ్ యాక్షన్ మూవీ ‘హిట్ ది ఫస్ట్ కేసు’ హిందీలో ఇదే పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్రా జంటగా నటించారు. జులై 15న ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ ‘జెర్సీ’ సినిమా కంటే దారుణంగా ఫ్లాప్ అయింది. హై బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ డే జస్ట్ రూ.1 కోటి మాత్రమే కలెక్ట్ చేసి చేసి ప్రొడ్యూసర్లకి షాక్ ఇచ్చింది. ఇది దిల్ రాజుకి రెండవ పరాజయమని చెప్పవచ్చు. అయినా పట్టు వదలని దిల్ రాజు మరో సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అల్లరి నరేష్ నటించిన నాంది హిందీ రీమేక్ హక్కుల్ని సొంతం కూడా చేసుకున్నాడు. ఈ సినిమా అయిన బాలీవుడ్‌లో హిట్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఒకవేళ ఇది కూడా ఎదురు తంతే నెత్తిన తువ్వాలే గతి!
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…