NewsOrbit
న్యూస్ సినిమా

Dil Raju: తమిళ సూపర్ స్టార్ కి 100 కోట్లు ఆఫర్ చేసిన దిల్ రాజు..??

Share

Dil Raju: నిర్మాత దిల్ రాజు ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతగా పేరొందిన దిల్ రాజు గత కొన్నాళ్ల నుండి వరుస విజయాలు సాధిస్తూ ఉన్నారు. మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు”, పవన్ కళ్యాణ్ తో “వకీల్ సాబ్” వంటి విజయాలు సాధించి తాజాగా సౌత్ ఇండియాలో అతి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నారు. చాలా వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. బాహుబలి పుణ్యమా మార్కెట్ టాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉండటంతో.. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ వరకు చాలా మంది నిర్మాతలు తెలుగు నటీనటులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Vamshi confirms his project with Thalapathy Vijay and Dil Raju

ఈ రీతిగా తాజాగా సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలుకానుంది. ఇప్పుడు ఇదే తరహాలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకరైన వంశీ పైడిపల్లి తో దిల్ రాజు మరో పాన్ ఇండియా మూవీ చేయటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా విజయ్ తో అని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Read More: Mahesh Babu: పుట్టినరోజు కు ముందే అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్..!!

అయితే ఈ సినిమా “మహర్షి” సినిమాకి రీమేక్ అన్న వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని దిల్ రాజు భారీ బడ్జెట్ తో పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సినిమా కోసం విజయ్ కి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ నడుస్తోంది. చాలావరకు దిల్ రాజు అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ ఉండటంతో ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.


Share

Related posts

బిగ్ బాస్ 4: హౌస్ లో ఆ ముగ్గురికి తీరని అన్యాయం జరిగింది ..!!

sekhar

Today Horoscope డిసెంబర్ 10th గురువారం రాశి ఫలాలు

Sree matha

Architecture: ఇల్లు కట్టుకోవడానికి వాస్తు ప్రకారం  అనువైన భూమి అవునో కాదో తెలుసుకునేందుకు ఇలా చేసి చూడండి!!

siddhu