Akhanda : నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మిరియాల రవీందర్ రెడ్డి శ్రీ ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో పాటు ఇద్దరి పాత్రలకి సంబంధించిన టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. బాలయ్య – బోయపాటిల
కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి భారీ స్థాయిలో అంచనాలున్నాయి.
కాగా అఖండ సినిమాను సెకండ్ వేవ్ కి ముందు మే 28న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ తో మేకర్స్ అనుకున్న ప్లాన్ మొత్తం తారుమారయింది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. దీంతో అఖండ సినిమా విడుదల విషయంలో అందరూ ఆసక్తికరమైన చర్చలు సాగుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం, మహేష్ బాబు సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి.
Akhanda : దసరా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ పుష్ప కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ ఆచార్య కూడా ఈ ఏడాది రానుంది. ఇక పవన్ కళ్యాణ్ – రానాల మల్టీస్టారర్ కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. జస్ట్ డేట్ ఒక్కటి అనౌన్స్ కావాల్సి ఉంది అంతే. అయితే ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న సినిమాలు కొన్ని విడుదల కూడా అయ్యాయి. ఇక అఖండ విడుదలకు సిద్దం కావాలంటే మరో నెల పైనే పట్టనుందట. అంటే దసరా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేయడానికి డేట్ లాక్ చేస్తారో.
.