రక్షణలో భాగస్వాములై దేశ సేవ చేయాలనుకుంటున్నారా..? మంచి జీతం, సమాజంలో గౌరవంతో పాటు రక్షణ రంగంలో ఉద్యోగం కావాలా..? కేవలం మెరిట్ ఆధారంగా భారత నౌకాదళం లోకి ప్రవేశించే అద్భుత అవకాశం వచ్చింది.. ఇండియన్ నేవీ వివిధ బ్రాంచ్ లోని పర్మినెంట్ కమిషన్ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..! పూర్తి వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు: 210
విభాగాల వారీగా :
1. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ :122 పోస్టులు
2. టెక్నికల్ బ్రాంచ్ :70పోస్టులు
3.ఎడ్యుకేషన్ బ్రాంచ్ :18 పోస్టులు
ఖాళీలు ఉన్న విభాగాలు :
లాజిస్టిక్స్ , ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , టెక్నికల్ (ఇంజనీరింగ్& ఎలక్ట్రికల్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, నేవల్ ఆర్మెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్.
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బిఈ, బిఎస్సీ, బీకాం బీఎస్సీ(ఐటి), పిజి డిప్లమో, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి(ఐటి), డి జి సి ఎ జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం :
అకడమిక్ మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు : 1.ఎక్స్టెండెడ్ నేవల్ ఓరియంటేషన్ కోర్స్ :
జనరల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్)
2.నేవల్ ఓరియెంటేషన్ కోర్సు రెగ్యులర్ : నేవల్ ఆర్మెంట్ ఇన్స్పెక్టర్ లాజిస్టిక్స్ , ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , టెక్నికల్
3.స్పెషల్ ఎన్ఓసి : ఎస్ఎస్సి (ఎగ్జిక్యూటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ).
దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2020
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
వెబ్ సైట్ :
https://www.joinindiannavy.gov.in/