మెగాస్టార్ చిరంజీవి వయసు పరంగా సీనియారిటీ హీరో అయిన సినిమాలు చేయడంలో ఇండస్ట్రీలో కుర్ర హీరోలను మించిపోయారు. దాదాపు మూడు సినిమాల షూటింగ్ లలో చిరంజీవి పాల్గొంటూ ఉన్నారు. గాడ్ ఫాదర్, బోలా శంకర్, చిరు 154. ఈ మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లలో బిజీబిజీగా గడుపుతున్న చిరంజీవి ఇటీవల “గాడ్ ఫాదర్”కి సంబంధించి సల్మాన్ ఖాన్ తో స్పెషల్ సాంగ్ షూట్ ముంబైలో ముగించుకుని స్పెషల్ ఫ్లైట్ లో మంగళవారం హైదరాబాద్ కి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే చిరంజీవితో డైరెక్టర్ బాబీ చేస్తున్న సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకమైన పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ బాబీ చిరంజీవి అభిమానులకు సరికొత్త ప్రామిస్ చేయడం జరిగింది. ట్విట్టర్ లో …#Mega 154 సినిమా కోసం నా పూర్తి ఎనర్జీ, ఎఫర్ట్స్ పెడతానని ప్రామిస్ చేస్తున్నానని మాట ఇచ్చాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.
చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై ఇద్దరు హీరోల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో “ముఠామేస్త్రి” తరహా పాత్ర చిరంజీవి చేస్తున్నట్లు సమాచారం. హీరో రవితేజకి జోడిగా కేథరిన్ థెరిస్సా నటిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.