Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో సినిమా రంగంలో సంచలనాలు సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. సోషల్ మీడియాలో సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందించటం వైరల్ గా మారటం జరుగుతుంది.
అంతే కాకుండా ఇటీవల కాలంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో హౌస్ లో రాణించిన లేడీ కంటెస్టెంట్ లతో ఆర్జివి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆరియనా తో జిమ్ లో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసిన ఆర్.జి.వి తాజాగా.. బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డితో కూడా తాజాగా ఫోటో షూట్ చేయటం జరిగింది. ఈ ముద్దుగుమ్మ వేసుకున్న చిట్టి పొట్టి దుస్తులకు కాఫీ టేబుల్ కింద నుండి రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ తో ఫోటో తీయడం ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రావటంతో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ బ్యూటీ లను వదలవా రామ్ గోపాల్ వర్మ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆర్జీవి తో ఆశూ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తున్నట్లు తాజా ఫోటోపై మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా జిమ్ లో అదే రీతిలో కాఫీ టేబుల్ కింద కూర్చుంటూ.. బిగ్ బాస్ బ్యూటీ లతో ఆర్జివి వ్యవహరించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.