NewsOrbit
న్యూస్

DIRECTORS: ఆ సత్తా ఉండేది ఆ ఇద్దరి దర్శకులకెనా .?

DIRECTORS: ఇండియాలోని అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో మంచి దర్శకులు ఉన్నారు. ప్రతీ ఏడాది గొప్పగొప్ప సినిమాలు తీస్తున్నారు. వంద కోట్ల కలెక్షన్లను రాబడుతున్నారు. అయితే, వీరంతా కమర్షియల్ ఎలిమెంట్లను మాత్రమే బేస్ చేసుకుని మూవీస్ తీస్తూ హిట్లు కొడుతున్నారు. కానీ, భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాదు.. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలా తక్కువ.. తీసిన ప్రతీ సినిమా హిట్.. అంతేకాకుండా ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్ ప్రమాణాలను కలిగి ఉంటాయని చాటి చెప్పిన ఒకే ఒక్క దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ‘బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్’ పార్ట్స్ ద్వారా భారతీయ సినిమా సత్తా ఎంటో ప్రపంచానికి రుచిచూపించాడు జక్కన్న.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా బాలీవుడ్ కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రావడం ప్రత్యేకంగా తెలుగు వారికి గర్వకారణం.. హాలీవుడ్ ప్రమాణాలతో సినిమాలు తీయడంలో ఒకప్పుడు దర్శకుడు శంకర్ పేరు వినబడేది. రోబో, రోబో-2 (robo)సినిమాలతో శంకర్ స్టామినా ఎంటో అందరికీ తెలిసింది. కానీ బహుబలి అంతటి మార్కెట్‌ను మాత్రం శంకర్ సినిమాలు అందుకోలేకపోయాయి.

RRR glimpse చూసి మహేష్ పవన్ రియాక్షన్ ఇదే..!

RRR సినిమాతో రాజమౌళి ఎంటో మరోసారి నిరూపిస్తాడా..?

నిన్న విడుదలైన RRR GLIMPSE చూశాక రాజమౌళి సత్తా ఎంటో మరోసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అర్థమై ఉంటుందని టాక్. బాహుబలి విడుదలయ్యాక ఇలాంటి సినిమాలు తాము కూడా తీయగలమని చాలా మంది హిందీ దర్శకులు ప్రకటించారు. తమిళంతో పాటు హిందీలోనూ ప్రయత్నాలు సాగాయి. కానీ, ఏవీ సఫలం కాలేదు. పాన్ ఇండియా కేటగిరీలో ఇప్పటివరకూ బాహుబలి రికార్డులు పదిలంగా ఉన్నాయి. అయితే, కలెక్షన్ల పరంగా అమీర్ ఖాన్ దంగల్‌ మూవీ తర్వాత బాహుబలి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది.


Rajamouli: రాజమౌళిని తక్కువ అంచనా వేసిన మెగా, నందమూరి ఫాన్స్‌కి భారీ షాక్ …!
ప్రస్తుతం బాహుబలిని మించేలా ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి చెక్కుతున్నాడట.. ఈ సినిమా కూడా బాహుబలి రికార్డులను తుడిచి పెడితే ఇక రాజమౌళిని అందుకోవడం ఎవరివల్ల కాదని ప్రూవ్ అవుతుంది. అందుకోసమే RRR మూవీలో భారీ విజువల్స్ , హై క్వాలిటీ టెక్నిషియన్స్‌ సాయంతో తుదిమెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్‌గా ఎదిగాడు. ఆ క్రెడిట్ రాజమౌళికి కూడా దక్కింది. పాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ అని.. ఇక RRR రిలీజ్ అయ్యాక భారీ విజయం సాధిస్తే తారక్ , చెర్రీ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదగడంతో పాటు మరోసారి వీరి మార్కెట్ పెరుగుతుంది.

శంకర్ తానేంటో మళ్లీ చూపిస్తాడా..?

తమిళ స్టార్ దర్శకుడు శంకర్( shakar).. రాజమౌళిని రికార్డులను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. బాహుబలికి ముందు భారీ తనం నిండిన సినిమాలు శంకర్ డైరెక్షన్‌లోనే వచ్చాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మొత్తం రాజమౌళి పేరే మారుమోగుతోంది. శంకర్ సెకండ్ ప్లేస్‌కు పడిపోవడం, ఇటీవల వచ్చిన రోబో -2 పెద్దగా అలరించకపోవడం కూడా ఆయనకు మైనస్‌గా మారాయి. అయితే, హాలీవుడ్ రేంజ్‌లో భారతీయ సినిమాలను తెరకెక్కించడంలో రాజమౌళి, శంకర్ మినహా వేరే ఇతర దర్శకులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. వీరిద్దరికి మాత్రమే ఆ రేంజ్‌లో సినిమాలు తీసే సత్తా ఉందని సినిమా వర్గాల్లో చర్చ నడుస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju