Directors: ఓటీటీలలో సినిమా కంటే బాగా సంపాదిస్తున్న స్టార్ డైరెక్టర్..!

Share

Directors: కరోనా వేవ్స్ రాకముందు ఓటీటీ అంటే ఏంటో చాలామంది జనాలకి తెలీదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్స్‌కి వెళ్ళి చూడాల్సిందే. ఎప్పుడో భారీ వర్షాలతో వరదలు ముంచుకొస్తేనో, 144 సెక్షన్ కింద కర్ఫ్యూలు విధిస్తోనో, బాంబ్ బ్లాస్టులు జరుగుతాయనే సమాచారాలు అందడంతోనో థియేటర్స్ మూసేసారు వారు తప్ప.. సాధారణంగా అయితే ఎప్పుడు థియేటర్స్ మూతపడే అవసరాలే వచ్చేవి కాదు. అలాంటిది కరోనా మహమ్మారి వల్ల దాదాపు సంవత్సరం పైగా థియేటర్స్ మూతపడే ఉన్నాయి.

directors-are earning more by ott than movies
directors-are earning more by ott than movies

ఈ నేపథ్యంలో సినిమాల బిజినెస్ జరగాలన్నా..ప్రేక్షకులను ఎంటర్‌టైనెమెంట్ కావాలన్నా ఒకే ఒక్క బెస్ట్ ఆప్షన్ ఓటీటీ. ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ఫ్రైమ్, నెట్ ఫ్లిక్స్ సహా జీ 5, తెలుగు ఓటీటీ ఆహా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ..ఇలా భాషతో సంబంధం లేకుండా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటీటీ బాట పట్టాయి. దాంతో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అంతా ఓటీటీ ప్లాట్ ఫాంస్‌లోనే దొరుకుంది. కొన్ని సినిమాల కథలు బావుంటే మంచి ఢీల్ కుదిరి నిర్మాతలకి బాగా లాభాలు కూడా వస్తున్నాయి.

Directors: ఓటీటీ కోసమే వెబ్ సిరీస్‌లు, స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి.

దాంతో దర్శకులు చాలామంది ఓటీటీలో ప్రాజెక్ట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం ఓటీటీ కోసమే వెబ్ సిరీస్‌లు, స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. రాజ్ అండ్ డీకే లాంటి వాళ్ళు ఫ్యామిలీ మాన్ వంటి విభిన్నమైన కథాంశంతో వెబ్ సిరీ్‌స్‌లు తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లు చూసేందుకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కూడా పెరుగుతోంది. అంతేకాదు కథ బావుంటే ఈ వెబ్ సిరీస్‌లను పెద్ద నిర్మాణ సంస్థలే భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించడానికి రెడీ అవుతున్నాయి.

అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లను, మీడియం బడ్జెట్ సినిమాలను రూపొందించేందుకు స్టార్ డైరెక్టర్స్, అలాగే టాలెంటెడ్ డైరెక్టర్స్‌ను భాగం చేసుకుంటున్నారు. సుకుమార్, కొరటాల శివ లాంటి వారు ఇలాంటి ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ వర్షన్ వంటి కీలక విభాగాలలో తమ వంతు సపోర్ట్ ఇస్తూ ప్రాజెక్ట్‌ను భారీ లెవల్‌కి తీసుకు వెళుతున్నారు. యంగ్ సత్యదేవ్ లాంటి యంగ్ హీరోలను ఇలాంటి మూవీస్‌లో ఎంచుకొని వారికి మంచి క్రేజ్ తీసుకు వస్తున్నారు.

Directors: ఎప్పుడెప్పుడు అవకాశాలు దక్కుతాయా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ సమయమలో కంప్లీట్ అవుతున్నాయి. అంతేకాదు సినిమా కంటే ఓటీటీల కోసం చేసే ప్రాజెక్ట్స్‌తోనే దర్శకులకి ఎక్కువగా రెమ్యునరేషన్ అందుతోంది. అందుకే నందిని రెడ్డి, ప్రశాంత్ వర్మ, అజయ్ భూపతి, సందీప్ రెడ్డి వంగ, సంకల్ప్ రెడ్డి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఈ వెబ్ సిరీస్, లేదా చిన్న సినిమాలకి దర్శకత్వం వహించేందుకు సిద్దమవుతున్నారు. కేవలం తెలుగు ఓటీటీ ఆహా కోసమే కాదు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ 5 లాంటి అగ్ర ఓటీటీ సంస్థలలో ఎప్పుడెప్పుడు అవకాశాలు దక్కుతాయా అని ఎదురు చూస్తున్నారు.


Share

Related posts

Tirupati by elections: తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ పై ఈసీ కి కంప్లైంట్ చేసిన చంద్రబాబు..!!

sekhar

కరోనా వ్యాక్సిన్.. మొదట రష్యా నుంచా..? ఇండియా నుంచా..??

somaraju sharma

Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.ధనలాభం కలుగుతుంది !

Sree matha