టాలీవుడ్ లో సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు ఇప్పటికే ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించారు. ఆ తరువాత దర్శకుడిగా మారి ‘వాన’, ‘తూనీగ తూనీగ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ‘డర్టీ హరి’ అనే సినిమా రూపొందించి తనలోని మరో దాగి ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరించారు. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను రూపొందించారు.
ఇటీవల డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా ఈ సినిమా రిలీజ్ అయింది. ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త ఏటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి రివ్యూస్ ను రాబట్టి ఒక సక్సెస్ఫుల్ ఫిలింగా నిలిచింది. అంతేకాకుండా ‘డర్టీ హరి’ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రోత్సహిస్తూ ఎమ్. ఎస్. రాజు దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని క్రిష్మస్ కానుకగా తెలుగు ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ యాప్ లో కూడా స్ట్రీమింగ్ కి పెట్టారు. అయితే మంచి రివ్యూస్ ను రాబట్టిన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో సంక్రాంతికి ‘డర్టీ హరి’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సినిమాలో యూత్ ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉండడంతో ఇదే కరెక్ట్ టైం అని భావించి జనవరి 8న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.
జనవరి 13 తర్వాత పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ‘డర్టీ హరి’ సినిమా ఈ గ్యాప్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉండడంతో జనవరి 8 న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. శ్రవణ్ రెడ్డి – రుహానీ శర్మ – సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు – సాయి పునీత్ నిర్మించారు.