మద్యం ప్రియులు ఎత్తి న బీర్ బాటిల్ దించకుండా తాగేస్తుంటారు.. దీని వల్ల కడుపులో చల్లగా హాయి గా ఉందంటూ, తెగ సంతోష పడిపోతూ ఉంటారు. ఎందుకిలా చేస్తున్నారు అని అడిగామనుకోండి… బీరు లో నీటి శాతం ఎక్కువగా ఉంది కాబట్టి బీరు తాగడం మంచి దంటు చెప్పేస్తుంటారు. బీర్ తాగితే ఆరోగ్యం గా ఉంటామనడంలో ఎంతమాత్రం నిజం కాదట. ఆల్కహాల్ తో కలిసిన బీర్‌ని తాగడం వల్ల మానవ శరీరం లోని ఏడీహెచ్ హార్మోన్ దెబ్బతింటాయి అని పరిశోధకులు చెబుతున్నారు.
అంత చల్లని బీర్ తాగడం వల్ల ఒంట్లో వేడి చేసి ఇబ్బందులకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే నీరు ఎక్కువ గా తీసుకో వాలి కానీ, నీటి శాతం ఎక్కువున్న బీర్ కాదని తెలియ చేస్తున్నారు.
బీర్ తాగడం వలన కొంత మేరకు మంచిదే అయినప్పటి కీ ఎక్కువగాతాగడం వలన వచ్చే ఫలితాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చిన్న సమస్యల నుండి ప్రాణాంతక సమస్యల వరకూ కూడా కారణం కావొచ్చు. దీనిలోఉండే ఆల్కహాల్ వలన శరీరం లో షుగర్ స్థాయి త్వరగా తగ్గి ఆకలిని పెంచుతుంది. ఆకలి పెరిగి ఎక్కువగా తినడం వలన ఊబకాయం వస్తుంది. పొట్ట పెరిగిపోతుంది. రెగ్యులర్ గా బీర్ తాగడం వలన మెదడు కణాలు దెబ్బతింటాయి.
దాని వలన పనులు ఏకాగ్రత తో చేయలేరు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీర వ్యవస్థ డీ హైడ్రేట్ అయి ఉదయం లేవగానే చాలా తలనొప్పి, నోరు ఎండిపోవడం కడుపులో వికారం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలసటకు గురవడంతో పాటు హ్యాంగ్ ఓవర్ వస్తుంది. రాత్రిపూట తాగితే తరచు బాత్ రూమ్‌కి వెళ్ల వలసి రావడంతో నిద్రా భంగం అవుతుంది.
గుండె కోట్టుకునే వేగం పెరిగి రక్త పోటు పెరుగుతుంది. ఆల్కహాల్ తాగడం వలన పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయి, గుండె మంట కు దారితీస్తుంది. బీర్ తాగడం వలన లివర్ దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ. కొన్ని బీర్లు లివర్‌కి మంచి చేసినప్పటికీ జాగ్రత్త లు పాటి స్తే నే మంచిది. కనుక బీర్‌కి దూరం గా ఉండటమే మంచిది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?