NewsOrbit
న్యూస్

వైసిపి క్యాడర్ లో నిరాశ …ప్రజల్లో పేరాశ …వెరసి పాదయాత్రలు పేలవం!జగనన్న కు ఇదో కొత్త పాఠం!!

వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లు తెరవాల్సిన తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకుని సులువుగా వచ్చే ఎన్నికల్లో కూడా గట్టెక్కేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రికి ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది.

వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల క్రితం సాగించిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావ సూచకంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరో తేదీ నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలకు పిలుపునివ్వటం తెలిసిందే.ఈ పాదయాత్రల్లో వైసిపి నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు కూడా తండోపతండాలుగా పాల్గొంటారని జగన్ సర్కార్ అంచనా వేసింది.అంతేకాకుండా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జనబలం పునాది కాగలదని కూడా లెక్కలేసుకుంది.కానీ వాస్తవంలో ఇందుకు భిన్నంగా జరిగింది.ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఎంత కష్టపడ్డా వైసిపి నాయకులు కార్యకర్తలే ఈ పాదయాత్రలపట్ల ఆసక్తి చూపలేదని పార్టీ కార్యాలయానికి సమాచారం అందుతోంది.

ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టడంతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల కింద నేరుగా లబ్ధిదారులకే నగదు జమ చేస్తున్నారు.దీంతో ఈ వ్యవహారాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తల పాత్రేమీ లేకుండా పోతోంది.ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంక్షేమ పథకాల అమలు బాధ్యతను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్గరుండి చూసుకునేవారు అంతో ఇంతో లబ్ధిపొందే వారు.జగన్ హయాంలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఇలాంటి అవకాశం లేకుండా పోవడంతో వారు నిరాశానిస్పృహలకు గురయ్యారట.అన్నీ అమరావతి నుండి సీఎం చేసేసుకుంటుంటే ఇక తమకు పార్టీలో ఏ పాత్ర ఉందని వారు అలిగారు.జనాల్లోకి వెళ్ళే అవకాశం ఇవ్వకుండా జగన్ తమను ఉత్సవ విగ్రహాలుగా చేశారని వారు లోలోపల రుసరుసలాడుతున్నారు.

పార్టీ అధికారంలో ఉన్న పది పైసలు సంపాదించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి దాపురించిందని వారు గుసగుసలాడుకుంటున్నారు .ఈ కారణం చేత వారు పాదయాత్ర దూరంగా ఉండి పోయి తమ నిరసన తెలిపారంటున్నారు.ఇక ప్రభుత్వం నుంచి డబ్బులు అందుకున్న లబ్ధిదారులు కూడా తమకు అందాల్సినది అందింంది కాబట్టి ఇక పాదయాత్రకు వచ్చేదేమీటని ఇంటిపట్టునే ఉండిపోయారు.వచ్చినా రాకున్నా జగన్ తమకు డబ్బులు పంపిస్తాడని వారు రిలాక్స్ అవుతున్నారు.దీంతో రాష్ట్రంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అన్న కార్యక్రమం పేలవంగా సాగిందని పార్టీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది.ఇది చూసిన తర్వాత అయినా మంత్రాలకు చింతకాయలు రాలవని సంక్షేమ పథకాలకు ఓట్లు పడవని వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా గ్రహించటం అవసరం అంటున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!