Potato: బంగాళా దుంపలు ఫ్రీజ్ లో నిల్వ చేసి వాడడం వలన ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త !!
మనము కొనే కూరగాయాలలో కచ్చితం గా ఉండేవి బంగాళా దుంపలు. దీనికి కారణం ఏవి ఎక్కువరోజులు నిల్వ ఉండడం తో పాటు చాలా తేలికగా రకరకాలుగా వండుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమం లో ఆలూను సరిగా నిల్వ చేసుకోక పొతే అవి త్వరగా పాడైపోతాయి. ఈ కారణం గా బంగాళా దుంపలు ఎక్కువ కాలం పాటు నిల్వ చెయ్యడానికి చాలా మంది అనేక పద్ధతులు పాటిస్తుంటారు. అయితే కొందరికే వాటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయడం అనేది తెలుస్తుంది.తడిగా ఉన్న ప్రదేశాల్లో బంగాళా దుంపలు పెట్టకూడదు.
ఎప్పుడు గాలి తగిలేలా పొడిగా ఉండే ప్రదేశం లో వాటిని ఉంచాలి . వాటిని ఏ ప్లాస్టిక్ కవరూ లలో కూడా మూసిఉంచకూడదు.చెమ్మ కి దుంపలు త్వరగా కుళ్ళి పోతాయి. చాలా మంది తెలియక వాటిని కూడా ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటారు. అలా చేయకుండా ఉండడమే మంచిది. దుంపలు ఫ్రిజ్లో నిల్వఉంచితే, దుంపల్లో ఉండే పిండిపదార్థం చెక్కరగా మారుతుంది. అలాంటి దుంపలు తినడం వలన షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దుంపలు నిల్వ చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా దుంపల్లో పాడైనవి ఉంటే… వాటిని ముందే తీసి పడేయాలి. తడి లేని దుంపలన్నీ ఒకే చోట పెట్టుకోవాలి. అవన్నీ గుంపుగా కాకుండా విడివిడిగా ఉండేలా పెట్టుకోవాలి. ఎందుకంటే వాటిలో ఏ ఒక్కటి పాడైన మిగతా వాటిని కూడా పాడుచేస్తుంది.
దుంపల్ని నిల్వ ఉంచాలి అనుకుంటే వాటిని కడుగకూడదు. కడగడం వలన అవి నిల్వ ఉండవు. మార్కెట్ నుంచి తెచ్చిన దుంపలు పాత వాటితో కలిపి పెట్టవద్దు. పాత దుంపల్ని ముందుగా వాడుకున్న ఆ తర్వాత మాత్రమే కొత్తగా తెచ్చిన వాటినివాడుకోవాలి. బంగాళా దుంపల్ని కాస్త చీకటి గా ఉండే ప్రదేశంలో నిల్వచేరేసుకోవచ్చు. వేరే కూరగాయలతో కూడా వాటిని కలిపి ఉంచకూడదు. ముఖ్యంగా ఉల్లి పాయలతో కలిపి బంగాళా దుంపలని ఉంచకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాటిని ఎక్కువ కాలం పాటు నిలవ చేసుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?