NewsOrbit
జాతీయం న్యూస్

EX Union Minister: కేంద్ర మాజీ మంత్రి పై అనర్హత వేటు!మూడేళ్ళు ఎన్నికల్లో పోటీకి నో ఛాన్స్!

EX Union Minister: కేంద్ర మాజీమంత్రి, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత బలరాం నాయక్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.మూడేళ్లపాటు ఆయన ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.2019 లోకసభ ఎన్నికల్లో ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు నిర్ణీత వ్యవధిలో ఆయన తన ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను సమర్పించలేదు.ఈ విషయమై బలరాంనాయక్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన నుండి సరైన సమాధానం రాలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు జూన్ పదోతేదీని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని 18 వ తేదీన తెలంగాణ గెజిట్లో ప్రచురించారు.

Disqualification hunt on former Union Minister! No chance to contest elections for three years!
Disqualification hunt on former Union Minister! No chance to contest elections for three years!

ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే!

బలరాంనాయక్ కు ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించడానికి తగిన సమయం, అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చిందని,అయినా ఆయన ఆ వివరాలను తమకు ఇవ్వలేదని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇలా ఆయన చేయడానికి గల కారణాలు సమర్థనీయంగా లేవని,ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.తమ నియమ నిబంధనలు ఉల్లంఘించినందున బలరాంనాయక్ మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అర్హులు కారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో నాయక్ మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

అన్ని వివరాలు ఇచ్చానంటున్న బలరాంనాయక్

అయితే తాను ఎన్నికల సంఘానికి తన ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చానని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.తనపై అనర్హతను విధించడాన్ని ఆయన ఖండించారు
తన వద్ద ఉన్న వివరాలన్నింటిని సాక్ష్యాధారాలతో సహా మళ్లీ ఎన్నికల సంఘానికి అందజేస్తానని, అవసరమైతే న్యాయ పోరాటం సాగిస్తానని బలరాంనాయక్ చెప్పినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది.2009 లో యూపీఏ2 హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బలరాంనాయక్ మంత్రిగా పనిచేశారు.అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోతూ వస్తున్నారు.ఇప్పుడు ఆయనపై అనర్హత వేటు పడటం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

 

author avatar
Yandamuri

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N