పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బండ్ల గణేష్ వీర భక్తుడు అన్న సంగతి తెలిసిందే. డై హార్ట్ ఫ్యాన్.. కళ్యాణ్ బాబు ఏదంటే అది.. ఈ భక్తుడు అలోచించకుండా చేసేస్తాడు. తనమీద అభిమానం చూపిస్తున్న వాళ్ళని పవన్ అలాగే చూసుకుంటాడు. తన కోసం పదేళ్ళ నుంచి సినిమా చేయాలని క్యూ లో ఉన్న నిర్మాతలని కాదని కూడా భక్తుడు బండ్ల గణేష్ కి అవకాశం ఇచ్చాడు. ఇలా గతంలోను రెండు సార్లు పవన్ అనూహ్యంగా గణేష్ కి డేట్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరచాడు.
ఈ ఇద్దరి కాంబినేషన్ లో పవన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 30 రూపొందనుందని బండ్ల గణేష్ తాజాగా వెల్లడించాడు. ఇంతక ముందు బండ్ల గణేష్ పవర్ స్టార్ తో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ సినిమాలు నిర్మించాడు. ఈ సినిమాలలో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. ఈ సినిమాతో బండ్ల గణేష్ ని టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ని చేశాడు పవర్ స్టార్.
అయితే బండ్ల గణేష్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అందరిలో ముందు మొదలైన ప్రశ్న ఈ సినిమాని తెరకెక్కించే దర్శకుడు ఎవరు అని. అయితే చాలామంది ఖచ్చితంగా త్రివిక్రం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని చర్చించుకుంటున్నారు. అంతేకాదు గతంలో త్రివిక్రం – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కోబలి అన్న సినిమా మొదలవబోతుందని వార్తలు వచ్చాయి. కాని అది కార్యరూపం దాల్చలేదు. చూస్తూ చూస్తూ పదేళ్ళు గడిచిపోయాయి గాని కోబలి మాత్రం పట్టాలెక్కలేదు.
దాంతో ఇప్పుడు పవర్ స్టార్ – త్రివిక్రం – బండ్ల గనేష్ కాంబినేషన్ లో కోబలి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. మరి అదే నిజమా కాదా అన్నది కొన్నాళ్ళు ఆగితే గాని క్లారిటీ రాదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 4 సినిమాలు కమిటయ్యాడు. ఈ సినిమాలు కంప్లీటయ్యాక బండ్ల గణేష్ నిర్మాణంలో ఉంటుందా లేక గ్యాప్ దొరికితే ముందే మొదలవనుందా చూడాలి.