Divi Vadthya: మహర్షి మూవీలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది నటి దివి. ఈ సినిమాతో పెద్దగా పాపులర్ కాకపోయినా బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యిందీ భామ. బిగ్‌బాస్ ఫేమ్‌తో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. కాగా ఇటీవలే విడుదల అయిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో దివి పూర్తిగా డీగ్లామ్ లుక్‌లో కనిపించింది. సునీల్‌కి భార్యగా, చిరంజీవిపై నిందలు వేసే ఒక అనాథ మహిళగా గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. గాడ్‌ఫాదర్ సినిమాలో దివి డిగ్లామ్ లుక్ లో కనపడటంతో నెక్స్ట్ వచ్చే ఛాన్సులు కూడా అలాంటివే ఉంటాయని ఫీల్ అవుతుంది ఈ భామ.
Divi Vadthya: అందుకే అలా
పైన చెప్పిన కారణం వల్లే గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యాక ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్స్‌లో బాగా బిజీ అయిందని తెలుస్తోంది. ఆ ఫొటోషూట్స్‌లో ఆమె గ్లామర్ లుక్స్ అందరికీ సెగలు పుట్టించేలా ఉంటున్నాయి. ఏమాత్రం సిగ్గు పడకుండా తన నడుము, బొడ్డు, ఎద సోయగాలు షో చేస్తుంది. ఆమె తన అందాలను అందరికీ చూపిస్తూ.. ఇక నుంచి పనమ్మాయి పాత్రలు కాకుండా కొంచెం గ్లామర్ పాత్రలు ఇవ్వమని ఇన్‌డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తోంది.
భయం కూడా ఉంది
సినీ ఇండిస్ట్రీలో ఒక యాక్ట్రెస్‌కి ఒక పాత్రలో గుర్తింపు వస్తే ఇక తరువాత నుంచి అన్ని అలాంటి పాత్రలే వస్తాయి. అలా చూసుకుంటే గాడ్ ఫాదర్లో నటించిన గ్లామర్ లేని పాత్ర లాంటివే తనకు వరుసగా వస్తే ఇండస్ట్రీలో దివి కేరిర్ ముగిసినట్లే! ఆ భయం వల్లే తన అందం మొత్తం చూపించేస్తుంది అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. హాట్ హాట్ ఫొటోషూట్స్‌లో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. దివి హీరోయిన్గా ఒక రెండు సినిమా లో నటించింది. కానీ అవి విడుదల కాలేదు. దాంతో గ్యాప్ వస్తుందేమోనని భయంతో కూడా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు, ఫాలోవర్స్‌కి, ఇండస్ట్రీ మేకర్స్‌కి తన గ్లామర్‌తో కనువిందు చేస్తుంది.