Divyansha kaushik: ‘మజిలీ’ బ్యూటీ గేర్ మార్చింది..బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ అందుకుంటోంది..

Share

Divyansha kaushik: టాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్నా కూడా ఆఫర్ రాక ఎదురుచూసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో మజిలీ ఫేమ్ దివ్యాంష కౌశిక్ ఒకరు. అక్కినేని నాగ చైతన్య – సమంత జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మజిలీ. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంష కౌశిక్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఫస్టాఫ్ మొత్తం చైతూ సరసన కనిపించేది దివ్యాంష కౌశిక్ మాత్రమే. పర్ఫార్మెన్స్ పరంగా అమ్మడికి బాగానే పేరొచ్చింది.

divyansha-kaushik-getting back to back offers
divyansha-kaushik-getting back to back offers

కానీ, ఆ తర్వాత ఆశించిన అవకాశాలే దక్కలేదు. మంచి హిట్ సినిమాలో నటించి బాగా పేరు తెచ్చుకున్నా కూడా దివ్యాంష కౌశిక్ ఎందుకు అవకాశాలు అందుకోలేదంటే ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం సమంత ఆ తర్వాత హీరో నాగ చైతన్య, దర్శకుడు శివ నిర్వాణలకే పోవడం వల్ల. ఎట్టకేలకి మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశం అందుకుంది. రామారావు ఆన్‌డ్యూటి సినిమాలో దివ్యాంష కౌశిక్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అవకాశం అందుకున్న ఈ యంగ్ బ్యూటీకి తాజాగా మరో సినిమాలో అవకాశం అందుకుంది. అది కూడా పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం.

Divyansha kaushik: దీంతో దివ్యాంష కౌశిక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.

యంగ్ హీరో సందీప్ కిషన్ – పాన్ ఇండియా స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైఖేల్’. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం సహా ఇతర అన్ని సౌత్ భాషల్లోనూ అలాగే హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్యాంష కౌశిక్ నటిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో దివ్యాంష కౌశిక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు గనక సూపర్ హిట్ అయితే ఇక తెలుగులో వరుసగా అవకాశాలు దక్కుతాయనడంలో సందేహం లేదు.


Share

Related posts

Mukku Avinash : గోవా వెళ్లి అంతా గోల గోల చేసేసిన ముక్కు అవినాష్?

Varun G

పార్టీ కండువాలు కప్పించుకుంటున్న నేతలు

somaraju sharma

కార్తికి నాగ్‌ సపోర్ట్‌

Siva Prasad