నిజమైన ఛాంపియన్!

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ నొవాక్  జకోవిచ్ నిజమైన ఛాంపియన్‌గా ఫ్యాన్స్ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఎందుకో తెలుసా. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏడవ సారి గెలిచిన ఖ్యాతి సంపాదించినందుకు  కాదు. మరో నాదల్‌ను మట్టి కరిపించి టైటిల్ గెలిచిన తర్వాత ఒక ఫ్యాన్‌కు తన జాకెట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చినందుకు. ఆ ఫ్యాన్‌‌ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఏమీ లేదు. దేని మీద ఆటోగ్రాఫ్ తీసుకోవాలో తెలియలేదు. జకోవిచ్ తన జాకెట్‌పై సంతకం చేసి దానిని ఫ్యాన్‌కు ఇచ్చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ వారి ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఈ వీడియో వైరల్ అయింది. ఫ్యాన్య నిజమైన ఛాంపియన్ అంటూ జకోవిచ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.