Packing Food : ప్యాకింగ్ ఫుడ్ కొనేటప్పుడు ఇలా రాసి ఉంటే మాత్రం కొనకండి!!

Share

Packing Food : మన ఆరోగ్యం
మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది.   ఇప్పుడు ఎక్కడ చూసిన  అంతా రెడీ టు ఈట్ లేదా  రెడీ టు కుక్   కనబడుతుంది.   ఆయిల్ ప్యాకెట్ల దగ్గర నుంచి, జ్యూసుల వరకు రకరకాల ఆహారం  ప్యాకెట్లలో అందుబాటులో ఉంది. అవి కొనేముందు ఆ ప్యాకెట్ లేబుళ్లపై ఆ ఆహారానికి సంబందించిన  వివరాలు ఉంటాయి. అవి చదివిన తర్వాత మాత్రమే వాటిని కొనడం  మంచిది. వాటిపై  కొన్ని రెక్కలుగా  రాసి ఉంటే మాత్రం కాస్త ఆలోచించి కొనండి. వాళ్లు రాసినవన్నీ నమ్మేయడం సరయిన పనికాదు.

Packing Food : ఉప్పు,చక్కెర

కొవ్వు అనే పదం  కనపడగానే  ఆ దరిదాపుల్లో లేకుండా  పారిపోతున్నారు చాలా మంది. ఫ్యాట్ ఫ్రీ అని  ఉంటే   మాత్రం  కొనడానికి ఆలోచించరు. కానీ ఫ్యాటీ ఫ్రీఅని ఉందంటే అందులో కొవ్వు చాలా తక్కువ శాతం ఉంటుంది అని అర్థం.    ఇది నిజమే అయినప్పటికీ..   ఆహర  పదార్థం నుంచి కొవ్వు తీసేయడం వల్లరుచిని కోల్పోతుంది. దానికి ఇంకా  రుచిని ఇచ్చేందుకు  ఉప్పు,చక్కెర , ఎక్కువ కలుపుతుంటారు. కానీ ఈ విషయం ప్యాకెట్ లేబుళ్లపై  రాయరు.  దీన్ని బట్టి ఫ్యాట్ ఫ్రీ అని ఉందంటే, అందులో ఉప్పు,చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని అర్థంచేసుకోవాలి.

 అధ్యయనాలు

మనం   వాడే  పంచదారకు  బదులుగా  హై ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్ ను  వాడుతుంటారు.  మనశరీరం దీన్ని  జీర్ణించుకోవడం  కాస్త  కష్టం గా  ఉంటుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు వివరించాయి. ఇది మన ఆరోగ్యంపై చెడుప్రభావం    చూపిస్తుంది. దీన్ని ఎక్కువగా సాస్‌లు,  రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్‌లలో, కూల్ డ్రింకులలో కలుపుతుంటారు.

పెరుగు  పాలు,

‘కొలెస్ట్రాల్ ఫ్రీ’ అని రాయడంవ్యాపారాన్ని పెంచుకునే విధానాల్లో వ్యాపారాలు అనుసరించే ఒక టెక్నిక్ గా చెప్పబడుతుంది. కొలెస్ట్రాల్ అనేది  జంతు ఉత్పత్తుల్లో మాత్రమే  ఉంటుంది   అంటే పెరుగు  పాలు,   వాటిలో ఉంటుంది. అయితే వ్యాపారులు పప్పులు, ఉప్పులపై కూడా కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసి అమ్ముతున్నారు. నిజానికి వాటిలో అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు.

షుగర్ ఉన్న ఆల్కహాల్
షుగర్ ఫ్రీ ఫుడ్స్ అని రాస్తున్న ప్యాకెట్లను  కొనే ముందు తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే, షుగర్ కు బదులు  ఆ ఆహారం లో  ఆల్కహాల్ ను  వాడుతుంటారు. షుగర్ ఉన్న ఆల్కహాల్ తీపిరుచిని మనకి  అందిస్తాయి.  అయితే మన  శరీరం దాన్ని శోషించుకోలేక ఇబ్బంది కి గురవుతుంది.   దీనివల్ల డయేరియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇంట్లోనే స్వయం గా
కాబట్టి ఫుడ్ పాకెట్స్ కొనేముందు కచ్చితం గా అన్ని వివరాలు చూసుకుని ప్రతిదీ క్షుణ్ణం గా పరిశీలించి కొనడం అనేది చాలా అవసరం. దీనికి తోడు పిల్లలకు కూడా అలాంటి ప్యాకెట్స్ ఎక్కువగా కొని ఇవ్వకుండా ఉండడం అన్నివిధాలా మంచిది. ఇంట్లోనే స్వయం గా చేసుకుని తినడం.. పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆహారం ఇవ్వడం అన్ని విధాలా మంచిది అని మరువకూడదు.


Share

Related posts

వకీల్ సాబ్ లో చేసిన మార్పులు చేర్పులతో సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా ఆఒక్కడికే ..!

GRK

AP Legislative Council: ఆ రెండు పోస్టులు ఆ ఇద్దరికేనా?దాదాపు ఫిక్స్ అంటున్న వైసీపీ వర్గాలు!!

Yandamuri

రా రమ్మని రాధాకు ఆహ్వానం

Siva Prasad