Transactions: మనకు అవసరానికి అనుగుణంగా అనునిత్యం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరపవలసి రావచ్చు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సర్వీస్ వినియోగం బాగా పెరిగింది. దీంతో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా సులభతరంగా మారాయి. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్.. పరిమితికి మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే, మీకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం వుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
Money : ధన ప్రాప్తి కోసం శుక్రవారం చేసుకునే పరిహారం గురించి తెలుసుకోండి !!
Transactions: ఈ విషయాలు తెలుసుకోండి:
ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసే వారు ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాల్సిన హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చూడండి. సేవింగ్స్ అకౌంట్ క్యాష్ డిపాజిట్ లిమిట్ ఒక వ్యక్తికి రూ. 1 లక్ష వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ తమ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేస్తే.. నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అలాగే కరెంట్ అకౌంట్ లిమిట్‌ను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని ఉల్లంఘిస్తే ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చి వివరణ కోరవచ్చు.
Money: ఈ స్కీములో మీరు డబ్బులు పెట్టారా? అయితే ఇక గోవిందా.!
క్రెడిట్ కార్డ్ వున్నవారు చూడండి:
నిర్ణీత పరిమితికి మించి లావాదేవీలు జరిపితే.. ఆదాయ పన్ను శాఖ దృష్టిలో పడవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డ్‌లను కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే వినియోగదారుల క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ లిమిట్ రూ.1 లక్షగా ఉంటుంది. ఈ పరిమితిని అస్సలు దాటకూడదు. ఈ లిమిట్‌ను కస్టమర్లు మించిపోతే IT విభాగం వారికి నోటీసు పంపవచ్చు. అలాగే FDల విషయంలో క్యాష్ డిపాజిట్ లిమిట్ రూ.10 లక్షలు మించితే, ట్యాక్స్ విభాగం మీ అకౌంట్‌పై నిఘా పెట్టవచ్చు. ఇలా అనేక విషయాలను ముందుగానే తెలుసుకొని మసలుకోండి.