NewsOrbit
న్యూస్

రొటీన్ ఇంజినీర్ గా మిగిలిపోవద్దు..! కొత్త కోర్సులు తెలుసుకోండి!!

 

దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం-ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ వృత్తి విద్య కోర్సులు పూర్తిచేసిన వారు సరైన నైపుణ్యం సంపాదించి చిన్నతరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ప్రతిచోటా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులు పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు. దేశ విదేశాల్లో ఉన్నత కోర్సులు చదువుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని వారి ఆలోచనా విధానం లో నైపుణ్యతను సంతరించుకుంటున్నారు. నూతన తరానికి చెందిన బీటెక్ / బీఈ కోర్సులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ అత్యాధునిక టెక్నాలజీ లకు ఉన్న ఆదరణ, విస్తృతి, వాటి ప్రయోజనాలు వలన బీటెక్ స్థాయిలోని ఎన్నో కళాశాలలు వీటిని ప్రవేశపెడుతున్నాయి.

 

 

ఇంజనీరింగ్ లో ఎన్ని కోర్సులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించే ప్రధాన బ్రాంచ్ లు కొన్నిఉన్నాయి. కంప్యూటర్ సైన్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో చేరే విద్యార్థులు కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలిసి ఉంటుంది. వీరు మెళుకువలను నేర్చుకోవడం ద్వారా బహుళజాతి సంస్థల్లో సులువుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఐదు లక్షల రూపాయల కనీస వేతనం తో వచ్చే కంపెనీలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచే ఎక్కువగా నియామకాలు జరుగుతూ ఉంటాయి. అన్ని రంగాల్లో కంప్యూటర్ వినియోగం పెరగడంతో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ టెక్నాలజీ ల పై పట్టు సాధించిన విద్యార్థులకు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ బహుళజాతి సంస్థల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంతేకాదు కంప్యూటర్స్ సంస్థను స్థాపించి ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సేవ తో కూడిన ఉద్యోగాల్లో “ఇంజనీరింగ్” ఒకటని చెప్పవచ్చు. ఏ ఇంజనీరింగ్ విభాగంలో ఉపాధి లేదా ఉద్యోగం దొరికిన మంచి జీతంతో పాటు ఆత్మ సంతృప్తి కూడా దక్కుతాయి. ఇంజనీరింగ్ డిగ్రీ కేవలం సాంకేతిక అంశాలనే కాకుండా కార్యనిర్వహణ, వ్యాపారం నైపుణ్యాలు, వ్యక్తిత్వవికాసం, సంభాషణా నైపుణ్యం వంటివి కూడా నేర్పిస్తుంది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. ఒక వ్యక్తి ఏ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుని జీవితంలో స్థిరపడడానికి రాణించడానికి కావాల్సిన అన్ని అంశాలు నేర్చుకో గలుగుతాడు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ తదితర అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ సాంకేతిక సాంకేతికతలు అంతర్గతంగా ఉండి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించడం ద్వారా స్వయం చాలక వాహనాలు, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ సిస్టం, వ్యవసాయం ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది.ఏ ఐ డేటా సైన్స్ బిజినెస్ అనలిటిక్స్ వంటి ఐటీ ఆధారిత అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అందువల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ నూతన కోర్సులు గురించి కొంతైనా అవగాహన ఉండాలి.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju