కుక్క ఫుడ్ తోనే మ‌జాకా.. అలాగే చేస్తుంది.. వైర‌ల్ వీడియో..!

కుక్క‌లు ఎంతో కాలం నుంచి మ‌నుషుల‌కు విశ్వాస‌పాత్ర‌మైన పెంపుడు జంతువుల్లా ఉంటున్నాయి. స‌రిగ్గా శిక్ష‌ణ ఇచ్చి మ‌చ్చిక చేసుకోవాలే కానీ కుక్క‌లు య‌జ‌మానులు చెప్పే ప్ర‌తి ప‌నిని చేస్తాయి. అయితే ఎంత య‌జ‌మాని అయిన‌ప్ప‌టికీ అవి కొన్ని సార్లు మాత్రం వారికి కూడా చుక్క‌లు చూపిస్తాయి. ముఖ్యంగా తిండి విష‌యంలో వాటి ప‌ట్ల ఏ క్ర‌మంలోనూ అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. అలా చేస్తే.. ఇదిగో కింద ఇచ్చిన వీడియోలో జ‌రిగిన‌ట్లే జ‌రుగుతుంది. ఇంత‌కీ అస‌లేమైందంటే..

do not tease dog with its food viral video

ఓ వ్య‌క్తి త‌న కుక్కకు డాగ్ ఫుడ్ పెట్టాడు. కానీ మ‌రీ దారుణంగా రెండే ఫుడ్ పెల్లెట్స్‌ను కుక్క బౌల్‌లో వేశాడు. దీంతో కుక్క త‌న య‌జ‌మాని మీదే తిర‌గ‌బ‌డింది. అయితే దాన్ని టెస్ట్ చేసేందుకే అలా అత‌ను కొద్ది ఫుడ్‌ను మాత్ర‌మే దాని బౌల్‌లో వేశాడ‌ని మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. అయినప్ప‌టికీ కుక్క‌ల‌కు ఫుడ్ పెట్టే విష‌యంలో అలా ప‌రాచికాలు చేయ‌వ‌ద్దు. య‌జ‌మాని అని కూడా చూడ‌కుండా అవి మీద‌కు ఎగ‌బ‌డ‌తాయి. ఆ వీడియోను చూస్తేనే మ‌న‌కు ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంది.

కాగా ఆ వీడియోను ఆ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అదిప్పుడు వైర‌ల్ అవుతోంది. దానికి ఇప్ప‌టికే 10.3 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 34 సెక‌న్ల నిడివి ఉన్న ఆ వీడియోను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసి చాలా మంది న‌వ్వుకుంటున్నారు. కుక్క‌తోనే ప‌రాచికాలా..? అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.