Old Age : ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరి సలహాలు వినండి.. కానీ మీ సొంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుంది అని అనిపిస్తే అది మాత్రం చేయండి. భగవంతుడిని బాగా ప్రార్ధించండి ఎంతగా అంటే ఏ కష్టం ,బాధ ,దుఃఖం ,సహాయం ఏది కావాలన్నా కూడా మనఃస్ఫూర్తిగా ఆయనను అడగండి.. ఇంకా ఎవరిని అర్ధించకండి.దేవుణ్ణి ఏదైనా కోరుతున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్ల కు క్షమాపణ, లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే అడగండి . ఆరోగ్యం మీద శ్రధ్ధ పెట్టండి.
మీ ఆర్థిక పరిస్థితి ననుసరించి, చక్కని పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీరం సహకరించి నంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకండి. పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి చాల సహజం అని గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి… మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు కూడా ఆ ఆనందాన్ని పంచండి.
ప్రతి సంవత్సరం కాలానుగుణంగా మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూర్ కు పెట్టుకోండి. దీనివల్ల జీవితం పట్ల మీ దృష్టికోణం అద్భుతం గా మారుతుంది. చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా పాజిటివ్ ఆలోచిస్తూ ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేలా చూసుకోండి.
జీవితంలో శాశ్వతమైనది అంటూ ఏది లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు.. ఈ మాటను ఎప్పటికి మరువకండి. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యత లన్నిటినీ తీర్చుకోండి. ఆ తర్వాత ఇక ఎవరి గురించి ఆలోచించవద్దు కేవలం మీరు మీ కోసమే అన్నట్లు బ్రతక గలిగితే చాలు. రిటైర్ అయ్యాక ఇంకా ఎక్కడో పనిచేయాలని మాత్రం ఆలోచించకండి… ఉన్నదానితో తృప్తి గా జీవితాన్ని గడిపేయండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?