ఈ రోజు ల్లో అందరు కంప్యూటర్ ముందు లేదా టీవీ ముందు గంటలు తరబడి కాలాన్ని గడిపేస్తున్నారు. దీనివలన ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి.ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట నుండి గంటసేపు అయినా నడవాలి అని సంకల్పం గాపెట్టుకోవాలి. నడిచేటప్పుడు షూ తప్పనిసరిగా వేసుకోవాలి. నడక మొదలుపెట్టాలి అనుకునే ముందు కనీసం 10 నిమిషాలు శరీరానికి చురుకుపుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం (వార్మప్)చేయాలి.
ఆ తరువాత నెమ్మదిగా నడవడం మొదలు పెట్టి వేగంగా నడవాలి.ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతూ 3 నిమిషాల తరువాత చదును ప్రాంతం మీద నడవాలి.2 నిమిషాల పాటు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద నడవాలి. ఇలా మార్చి మార్చి నడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మొదలు పెట్టినప్పుడు తక్కువ దూరం నడిచినా,ఆ తరువాత వేగం,దూరం రెండు పెంచుతూ వెళ్ళాలి. ఆహారం గా పండ్లు తినడం, కొబ్బరి నీళ్ళుత్రాగడం వలన అధిక బరువు తగ్గుతారు.
గంట కు ఆరు కిలోమీటర్ల వేగం తో నడి స్తే అన్ని విధాలా మంచిది. మొదలు పెట్టినప్పుడు గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరం, సమయం దృష్టి లో ఉంచుకోవటం ముఖ్యం. ఇలా నడక, కొంచెం వ్యాయామం చేస్తే.. ఒత్తిడి లో ఉన్నప్పుడు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది. దీనితో పాటు శరీరం లో పేరుకు పోయిన కొవ్వు కూడా తగ్గిపోతుంది.
ఇలా చేయడం అందరికీ సాధ్యం కాకపో వచ్చు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని పనులు చేయడం, వాకింగ్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని పరిశోధనలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా గుండె నొప్పి,కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వాకింగ్, ఇంట్లో తోటపని వంటివి చేసిన మంచి ఫలితం పొందవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు.