school Bags: బుక్స్ బ్యాగ్ లేదా లంచ్ బ్యాగ్
పిల్లలు స్కూల్ బాగ్స్ (school bags ) ఎప్పుడు చాలా శుభ్రం గా ఉండాలి.అవి ఎంత శుభ్రం గా ఉంటే వాళ్ళు అంత ఆరోగ్యం గా ఉంటారు. చాలా మంది బ్యాగ్ మీద దృష్టి పెట్టరు. అది చాలా మురికి తో మడ్డి పట్టేసి వాసన వాస్తు ఉంటుంది.బుక్స్ బ్యాగ్ లేదా లంచ్ బ్యాగ్ ఏదైనా కూడా ప్రతి వారం బాగా శుభ్రప్రరచండి. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ప్రతి రోజు వేడి నీటితో శుభ్రం చేయాలి.
school Bags: తాజా సువాసన
ఇప్పుడు బుక్స్ బ్యాగ్స్ కానీ లంచ్ బ్యాగ్స్ కానీ ఉతికి ఎండలో బాగా ఆరపెట్టాలి. అందులో ఉండే బ్యాక్టీరియాను ( Bacteria ) చంపడానికి ఎండ సహాయపడుతుందిబాగా ఉపయోగపడుతుంది. స్కూలు బ్యాగ్ ఉతికిన తరువాత కూడా మంచి సువాసన రావడానికి ఒక చిన్న గిన్నెలోకి చెంచా సగం నీళ్ళు తీసుకొని అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ 3-4 చుక్కలు వేసి దానిని బాగా కలపండి. తర్వాత చిన్న చాక్ ముక్క తీసుకొని ఈ ద్రావణంలో వేసేయండి. చాక్ ముక్కని ద్రావణం మొత్తాన్ని పీల్చుకోనివ్వండి. ఇప్పుడు చాక్ని ఏదైనా చిన్న వస్త్రంలో చుట్టి మీ పిల్లల స్కూలు బ్యాగ్ మూలలో ఉంచండి. ఇలా చేయడం వలన బ్యాగులకు తాజా సువాసన పట్టి ఉంటుంది. మీరు ప్రతి వారం దీన్ని మార్చేయండి.
ఆరోగ్యం దెబ్బ తింటుంది
లంచ్ బ్యాగ్స్ లో ప్రతి రోజు ఎదో ఒకటి ఒలకడం వలన చాల దుర్వాసన వస్తుంటుంది. దానికోసం కప్పు బేకింగ్ సోడా తీసుకొని బ్యాగ్ పొడిగా ఉన్నప్పుడు దాని అడుగున వేసి దీనిని రాత్రంతా అలా వదిలేసి, తరువాత దాన్ని పారేయండి. దుర్వాసను పోగొట్టడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మేము చాలా బిజీ అని చెప్పి ఇలాంటివి అన్ని పట్టించుకోకపోతే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రీ స్కూల్ పిల్లల పెన్సిల్ బాక్సలు వంటివి ఎప్పటికప్పడు శుభ్రం గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి.