NewsOrbit
దైవం న్యూస్

River: నదిలో స్నానం చేసేటప్పుడు ఇలా చేసారంటే,పుణ్యం సంగతి ఎలా ఉన్న పాపం మాత్రం వస్తుంది!!

Share

River: పుణ్యం సంగతి ఎలా ఉన్న
పుణ్య తిథులలో,పర్వ దినాలలో నది  స్నానం శ్రేష్టం అని చెప్పబడింది.అలా నది స్నానం  ( Bathing ) చేసేముందు ఇంట్లో తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలు కట్టుకుని    అప్పుడు మాత్రమే  స్నానం కోసం.. నదీతీరానికి వెళ్ళాలి. ముందు స్నానం చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి నదిలో మునగకూడదు. నదిలో దిగిన తర్వాత ఒళ్ళు రుద్దుకోవటం, ఉమ్మివేయడం, మలమూత్ర విసర్జనలు చేయటం అనేది నిషిద్ధం అనేది గమనించాలి. నదీస్నానం ( River Bath ) అంటే నది దిగి లో కేవలంమూడు సార్లు మునకవేయటం మాత్రమే. అంతకుమించి అక్కడ సబ్బు  , షాంపూలు వాడటం వంటివి చేయకూడదు. అలా చేయడం అపచారం, పుణ్యం సంగతి ఎలా ఉన్న పాపం మాత్రం  వస్తుంది.

River: నది పవిత్రతకు

నదిలో స్నానం చేసేటప్పుడు  ఉతికిన   అంచు  ఉన్న బట్టలు కట్టుకోవాలి . పురుషులైతే  పంచకట్టుకుని చేయాలి. ప్యాంటు, షర్టు  వంటి వాటితో  చేయకూడదు.  మగవారు  నదిప్రవాహానికి ఎదురుగాను, ఆడవారు  నదిప్రవాహం వెళుతున్న దిశగా నిలబడి స్నానం చేయాలి. తల పూర్తిగా మునిగేట్టు   3 సార్లు మునకవేయాలి. ముందుగా  ఊపిరి తీసుకుని, బొటనవేలితో  ముక్కురంధ్రాలను, మధ్యవేలుతో చెవి రంధ్రాలను మూసి, కన్నులు, నోరు మూసుకుని స్నానం చేయాలి.  అలా చేయకపోతే  నీరు ముక్కు, చెవి  నుండి  లోపలికి  వెళ్ళవచ్చు.      స్నానం చేశాక తడి బట్టలను నదిలో ఎట్టి పరిస్థితి లో కూడా  పిండకూడదు.  అలా   ఇంట్లో అశుభం జరిగినప్పుడు మాత్రమే చేస్తారు. అట్లాగే నదిలో బట్టలు ఉతకడం, జాడించడం లాంటి పనులు  అస్సలు చేయకూడదు. నది పవిత్రతకు ఎలాంటి భంగం కలిగించకుండా  ఉండాలి.

అద్భుత ఫలితాలు

అవకాశం ఉంటే పువ్వులు , గాజులు, పసుపుకుంకుమలతో నదీమ తల్లులకు  తాబులం సమర్పించడం  అనేది చాలా మంచిది.   కానీ చీరలు, జాకెట్ ముక్కలు నదిలో వదిలేయకుండా అక్కడే స్నానం కోసం వచ్చిన ముత్తయిదువలకు  ఇస్తే, నదీమతల్లి ఆశీర్వదిస్తుంది.  అలా చేయడం వలన జలగండాల నుంచి నదీమతల్లి  మనల్ని కాపాడుతుంది.   శాస్త్రం చెప్పినవిధంగా  నదీస్నానం  చేయడం వలన ఎంతో అద్భుత ఫలితాలు ఉంటాయి అన్నది ఎవరు కాదనలేని నిజం.   నదులను కలుషితం కానివ్వకుండా, నదీమతల్లుల పవిత్రతనుకాపాడుదాం .అన్నిటికంటే ముందు బాగా గుర్తు పెట్టుకోవాలిసింది ఏమిటంటే  నదుల్లో కూడా ప్రాణం ఉందని  నమ్మండి.


Share

Related posts

విద్యార్థులకు తీపి కబురు

somaraju sharma

TDP: అసలే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు కొత్తగా మరో మూడు తలనొప్పులు..!?

somaraju sharma

తెలుగు యూనివ‌ర్స్ పోటీల్లో ‘మిస్ టీన్’గా ఇండో -అమెరిక‌న్!

Teja