Pets : మనుషులకు ఉన్న ఒకే ఒక్క నమ్మకమైన సహజీవి ఏదైనా ఉంది అంటే అది పెంపుడు కుక్క అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు పెంపుడు జంతువుల వల్ల వచ్చే ఆనందం ప్రపంచం లో ఉన్న మరి వేటితో రాదు అంటే ఆశ్చర్యం లేదు. పెంపుడు కుక్కలు లేదా పిల్లులు ఏదైనా సరే, మనం పెంచుకుంటున్నాము అంటే మన కుటుంబం లో ఇంకో సభ్యుడు పెరిగినట్టే ఉంటుంది.
ఇవి మీకు తోడుగా ఉండడం తో పాటు మీ ఆరోగ్యాన్ని పెంచే క్రమంలో మరిన్ని ప్రయోజనాలను కలిగి స్థాయి. అనేక అధ్యయనాలు తెలిపిన సారాంశం ప్రకారం, పెంపుడు జంతువులతో సావాసం మానసిక ఆరోగ్య ఎదుగుదలకు కారణమవుతుందని రుజువైంది . ఒత్తిడి, ఆందోళన తగ్గించడంతో పాటు బుద్ధి మాంద్యం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని తేలింది. పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్లు నిస్వార్థంగా ప్రేమను పంచే గుణం పెరుగుతుంది.ఆడవారైనా మగవారైనా పెంపుడు జంతువులు ఉన్న వాళ్ల తో ప్రేమలో పడితే పెళ్లి చేసుకున్న వాళ్ల జీవితం ఆనంద సాగరమే అని చెబుతుంటారు.
వీళ్లు జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ ని, నమ్మకాన్ని చూపెడతారు . వాళ్లలో సాధింపులకు పాల్పడే తత్త్వం చాలా తక్కువగా ఉంటుంది . అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఓ కుక్కపిల్లను లేదా పిల్లి పిల్లలు పెంచుకోవడం వల్ల వాళ్ల మధ్య ఒత్తిడి కారణంగా చోటుచేసుకునే తగవులు తగ్గుతాయి .
ఆ పెంపుడు జంతువుని చూడగానే అన్నీ మరిచి హాయిగా ఉంటారని నిపుణులు తెలియచేస్తున్నారు . ముఖ్యంగా పెంపుడు జంతువుల వల్ల వాళ్లలో ఆక్సీటోసిన్శాతం పెరిగి ప్రేమబంధం మరింత పటిష్టం అవుతుంది అని తెలియ చేస్తున్నారు .
పెంపుడు జంతువులతో సాన్నిహిత్యం శరీరంలో కార్టిసోల్ హార్మోన్ లెవల్స్ తగ్గించడంతో పాటు నెమ్మదిగా రక్తపోటు ను కూడా తగ్గించగలదు. ఒంటరితనాన్ని తగ్గిస్తూనే , మీ మానసిక స్థితికి సాంఘిక మద్దతు పెరిగేలా చేస్తుంది. మానసిక ఆరోగ్య సంస్థ ల లెక్క ప్రకారం, పెంపుడు జంతువులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగల ఉత్తమమైన మార్గం అని తెలియచేస్తున్నాయి.