Principles of Mars : హారతిని మంగళ సూత్రాలకు  అద్దుకుంటున్నారా  ?

Share

Principles of Mars :   ఆడవారిలో చాలా మంది  హారతిని మంగళసూత్రానికి అడ్డుకోవడం చూస్తూ ఉంటాం..ఇలా చేయడం అనేది దోషం గా చెప్పబడింది.హారతి అలా అద్దడం వలన  భర్తకు ఆయుక్షీణం, కార్యనష్టం, అనారోగ్యం, మానసిక వ్యధలు, ప్రమాదాలు,శతృభాధలు, ఋణ, ఆర్థిక బాధలు వంటి నష్టాలు  ఏర్పడతాయి. మంగళ  సూత్రాలకు  కుంకుమ  అద్దుకోవడం అనేది శుభకరం.. హారతిని మాత్రం  ఇవ్వరాదు.  వయసులో ఉన్న ఆడపిల్లలు  బొట్టు మరియు గాజులు తప్పని సరిగా వేసుకోవాలి. ఇలా  బొట్టు గాజులు వేస్తుకోవడం వలన  వివాహం  తరువాత, మంచి గౌరవప్రదమైన అత్తగారి కుటుంబం పొందుతారు.

Principles of Mars :  ఆర్థిక బాధలు తగ్గడానికి

వ్యాపారసంస్థలో లేదా ఆఫీసులో  తూర్పు ముఖం గా  కూర్చుంటే ధన ప్రాప్తి, ఆదాయంలో పెరుగుదల వంటివి సంభవిస్తాయి.
కాస్త పన్నీరు  తీసుకుని అందులో   కాటన్ తో తయారయిన కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి  ఆరబెట్టి,శుక్రవారం ఆ వస్త్రంతో 3 వత్తులు చేసి, ఆవు నేతితో దీపారాధన చేస్తే, సకల సంపదలు  చేకూరతాయి.
గురువారం రోజు ఐదు పత్తి వత్తులు వేసి  ఆవు  నెయ్యతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.

శ్రీ స్తోత్రమ్

ఎవరు  శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని  మూడు పూట్ల చదువుతుంటారో.. వారు  మహా ధనవంతులవుతారని శ్రీ దేవీ భాగవతము లో వివరించబడింది.
ప్రతి  దినం  సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండ లక్ష్మి  కరుణ కృప వర్షిస్తుంది. శ్రీ స్తోత్రమ్ ప్రతి నిత్యం చదివితే   ధనం ప్రాప్తిస్తుంది. ప్రతి రోజూ మూడు పూట్ల  కనకధారా స్తోత్రం చదువుకుంటే అపార సంపద  కలుగుతుంది.
ఉగాది తరువాత వచ్చే శుక్రవారం రోజు ఇష్టమైన దైవానికి అభిషేకం  చేసుకుంటే  ఆ సంవత్సరమంతా ధనానికి  లోటు ఉండకపోవడం  తో పాటు జాతకరీత్యా ఉన్నదోషాలు కూడా  తగ్గిపోతాయి.
పైన  తెలియ చేసిన వాటిలో  మీకు ఆచరించడానికి వీలైన వాటిని   ఆచరిస్తూ   లక్ష్మి  అనుగ్రహం పొందండి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్ళడం మీద రగిలిపోతున్న జబర్దస్త్ హైపర్ ఆది ??

sekhar

ఇక ఫాస్టాగ్‌తో పార్కింగ్ ఫీజు కూడా చెల్లించ‌వ‌చ్చు..!

Srikanth A

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ లో జరిగిన ఊహించని సంఘటన తో జబర్దస్త్ ఫాన్స్ అందరూ కంగారు పడుతున్నారు !!

sekhar