NewsOrbit
న్యూస్ హెల్త్

పంచదార ఎక్కువగా తింటున్నారా.. ఆ సమస్యలు గ్యారంటీ?

కొంద‌రికి పంచ‌దార అనే పేరు విన‌గానే నోట్లో నీళ్లు ఊరుతాయి. వెంట‌నే తియ్య‌గా ఉండే ప‌దార్థాల‌ను తినాల‌ని మొండికేస్తారు. స‌మ‌యం… మ‌ధ్యాహ్నం కావొచ్చు.. అర్థ రాత్రి కావొచ్చు.. ప‌నిలో ఉండొచ్చు.. ఏ ప‌ని చేయ‌కుండా ఉండొచ్చు. ఉన్న‌ట్టుండి తీపి తినాల‌నే కొంద‌రిలో క‌లుగుతుందంటా.. అయితే కోరిక క‌ల‌గ‌డం త‌ప్పుకాదు కానీ అతిగా చెక్క‌ర తింటే చాలా ర‌కాల హెల్త్ ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయ‌ని ఇప్ప‌టికే ప‌లువురు వైద్యులు చెబుతున్నారు.

అయితే షుగ‌ర్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల్లో ముఖ్యంగా ఉండే వాటిగురించి వైద్యులు చెబుతుంటారు. ఆ స‌మ‌స్య‌ల్లో.. అధిక బరువు పెర‌గ‌డం, హార్ట్ డిసీజ్ లు రావ‌డం, యాక్నే సమస్య, టైప్ 2 డయాబెటీస్, కాన్సర్, డిప్రెషన్, చర్మం ముడతలు ప‌డ‌టం, శరీరంలో శక్తి మెత్తం పోయిన‌ట్లు అనిపించ‌డం, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం, డెంటల్ స‌మ‌స్య‌లు, జ్ఞాపక శక్తి స‌మ‌స్య‌లు మొద‌లైన‌వి ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

అయితే షుగ‌ర్ ను ఎక్కువ‌గా తినాల‌ని అనిపించ‌డానికి ప‌లు కార‌ణాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతుంటారు. చ‌క్క‌ర‌కు సంతోషానికీ చాలా దగ్గర సంబంధముంద‌రి చెబుతుంటారు. చ‌క్క‌ర‌ను తిన్న‌ప్పుడు శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంద‌ని తెలుపుతున్నారు. ఆ హార్మోన్ వ‌ల్ల మంచి ఫీలింగ్ వ‌స్తుందంటా.. ఆ మంచి ఫీలింగ్ కోస‌మే మ‌నం త‌ర‌చు చ‌క్క‌ర‌ను తింటామ‌ని వైద్యులు చెబుతుంటారు.

పొట్ట నిండిన‌ప్పుడు.. ఇంకేమీ తినాల్సిన అవ‌స‌రం లేద‌ని మెద‌డుకు స‌మాచారాన్ని అందించే హార్మోన్ పేరు లెప్టిన్. ఈ హార్మోన్ స‌రిగ్గా ప‌ని చేయ‌కుండా చ‌క్క‌ర అడ్డుకుంటుంది.అందువ‌ల్ల మ‌నం ఎక్కువ‌గా తింటామ‌ని చెబుతుంన్నారు. అలాగే బ్రెయిన్ లో ఉండే హైపోథాలమస్ మ‌నం ఎంత తింటున్నామ‌ని గ‌మ‌నించ‌దంటా.. కార‌ణం షుగర్ ఈ యాక్టివిటీకి అడ్డుకుంటుంద‌ని చెబుతున్నారు వైద్యులు.

అయితే చ‌క్క‌ర తిన‌డాన్ని త‌గ్గించాలంటే దాని ప్లేస్ లో బెల్లం, తేనె వంటివి తీసుకోవాలి. చ‌క్క‌ర తో చేసిన వాటిని కాకుండా బెల్లంతో చేసిన వాటిని తినాలి. టీ, కాఫీలో కూడా వీలైనంత త‌క్కువ చ‌క్క‌ర‌ను వాడాలి. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివి తిన‌డం వ‌ల్ల చ‌క్క‌ర‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంది. అయితే ఇలాంటి అల‌వాటు మీకు ఉంటే ముందు డాక్ట‌ర్ ను సంప్ర‌దించి స‌లహాలు తీసుకోవ‌డం మాత్రం మ‌రువొద్దు.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!