NewsOrbit
న్యూస్ హెల్త్

కౌజు పిట్ట గుడ్డు తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ మ‌ధ్య ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ విప‌రీతంగా పెరిగిపోతుంది. దీనిపై వైద్యులు కూడా ప‌లు ప‌రిశోధ‌న‌లు చేసి ఏది శ‌రీరానికి మంచిదో.. ఏది కాదో చెబుతున్నారు. పౌష్టిక ఆహారం తీసుకోవాలంటే అందులో నాన్ వెజ్ ఉండాల‌ని వైద్యులు చెబుతుంటారు. అందుకే చికెన్, మ‌ట‌న్ కు మంచి గిరాకి ఉంటుంది. అయితే వీటితో పాటు రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంద‌ని వైద్యులు చెబుతుంటారు. అలా చేస్తే.. శ‌రీరానికి కావల‌సిన పోష‌కాల‌న్నీ అందుతాయ‌ని చెబుతుంటారు.

అయితే గుడ్ల‌ల్లో కేవ‌లం కోడి గుడ్లే కాకుండా.. బాతుగుడ్లు, కౌజు గుడ్లు కూడా ఉంటాయి. అందులో కౌజు గుడ్ల‌కు ఇప్పుడు భారీగా డిమాండ్ పెరిగింది. వీటికి డిమాండ్ పెర‌గ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. వీటివ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మీరుగాని అవి తెలుసుకుంటే కోడి గుడ్ల‌ను మానేసి కౌజు పిట్ట గుడ్ల‌ను తింటారు.

అయితే ఈ కౌజు పిట్ట‌ల గుడ్ల‌కు ఇప్ప‌టికే.. యూరప్, ఉత్తర ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. అక్క‌డ కోడి గుడ్ల‌కంటే కౌజు పిట్ట‌ల గుడ్ల‌కే డిమాండ్ ఎక్కువ‌. కోడి గుడ్లతో పోల్చితే కౌజు గుడ్లు చిన్నగా ఉంటాయి. కానీ కోడి గుడ్ల కంటే 30 % ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే జపాన్ లాంటి దేశంలో కూడా కౌజు పిట్ట‌ల గుడ్ల‌కు భారీ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ వ‌ల్ల అక్క‌డ ఒకేసారి 3 నుంచి 5 గుడ్లను తింటుంటారు.

అందుకే జపాన్ లో కౌజు పిట్ట గుడ్ల‌కు మంచి గిరాకి ఉంటుంది. మ‌న‌లో చాలా మందికి కోడి గుడ్లు తిన‌డం అంటే అలెర్జీ. అలాంటి వారికంద‌రికి కౌజు పిట్ట గుడ్లు సెట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతుంటారు. ఒక వంద గ్రాముల కౌజు పిట్ట‌ల గుడ్ల‌లో 74గ్రాముల నీరు ఉంటుంది. అలాగే 158 కేల‌రీల ఎన‌ర్జీ దాగి ఉంటుంది.

అదే కాకుండా 13 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అలాగే 11 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. కాల్షియం, ఐరన్, షుగర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, ఫోలేట్, విటమిన్ బి-12, విటమిన్ -ఎ, విటమిన్ -ఈ, విటమిన్ -డీ, కొలెస్ట్రాల్ కూడా పుష్క‌లంగా ఉంటాయి. వీటితో ఆరోగ్యానికి ప‌లు ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. ఆ ప్ర‌యోజ‌నాల్లో.. గుండె జబ్బులు, హైబీపీ, ఆర్థరైటిస్, హార్ట్ ఎటాక్, కాన్సర్, జీర్ణ సంబంధ సమస్యల్ని ఈ గుడ్లు తగ్గిస్తాయి.

అలాగే అలర్జీలు, కడుపులో మంటలు ఉంటే ఈ గుడ్ల వ‌ల్ల అవి త‌గ్గుతాయి. శ‌రీరంలో హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే విటమిన్ బి ఉండే ఈ కౌజు పిట్ట గుడ్ల‌ను తిన‌డం చాలా మంచిది. వీటితో పాటు ఎన్నో లాభాలు ఉన్నాయి. మీరు గాని నాన్ వెజ్ ప్రియులు అయితే ఒక సారి ట్రై చేసి చూడండి. ఇంకో విష‌యం మంచిద‌ని ఎక్కువ‌గా తింటే అస‌లుకే మోసం వ‌స్తుంది. ఏదైనా లిమిట్ కు మించ‌కుండా చేయాలి.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju