ట్రెండింగ్ న్యూస్

మీకు తిండి పుష్టి ఉందా.. అయితే బుల్లెట్ సొంతం అయినట్టే.. అది ఎలాగో చూడండి..

Share

భోజన ప్రియులు కు శుభవార్త.. అంతే కాదండోయ్ ఇష్టంగా లాగించేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ ను పొందవచ్చు.. అయితే ఏదో మతలబు ఉందను కుంటున్నారా.. నిజమేనండి.. ఊరికే వస్తే అంత కిక్కే ఉంటుంది.. మేము పెట్టిన ఆహారం పూర్తిగా తింటే రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉచితంగా ఇస్తానంటూ ఓ వినూత్న చాలెంజ్ తో ఓ రెస్టారెంట్ ముందు కొచ్చింది.. ఆ చాలెంజ్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Do you have enough food .. but if you own a bullet .. see how it is ..

పుణేకు చెందిన “హోటల్ శివరాజ్” అనే రెస్టారెంట్ “బుల్లెట్ థాలి” ఛాలెంజ్ ను ఆఫర్ చేస్తోంది.. ఈ థాలి ని పూర్తిగా తిన్న వారికి రూ 1.65 లక్షల విలువైన సరి కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను ఉచితంగా అందిస్తామంటూ చాలెంజ్ చేసింది. ఈ చాలెంజ్ కు మీరు చేయాల్సిందల్లా ఈ బులెట్ థాలి ప్లేటును ఒక గంట లోపు పూర్తిగా తినేయాలి. ప్లేటులో ఏ కొంచెం మిగిలిన వారిని ఈ పోటీకి అనర్హులు గా గుర్తిస్తారు.

 

ఈ బులెట్ థాలి లో సుమారు నాలుగు కిలోల బరువైన ఆహారం ఉంటుంది. ఇందులో మటన్, వేయించిన చాపల తో పాటు 12 రకాల వంటకాలు తో కూడిన ఆహారం ఉంటుంది. ఈ స్పెషల్ బుల్లెట్ థాలి లో ఫ్రైడ్ సూర్మాయి, పొమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరి, డ్రై మటన్, గ్రే మటన్ చికెన్ మసాలా ,కొలంబి బిర్యానీ లతో పాటుగా మొత్తం 12 రకాల వంటకాలు ఉంటాయి. కస్టమర్ల కోసం ఈ నాన్ వెజ్ ప్లేట్ ను సిద్ధం చేయడానికి సుమారు 55 మంది పనిచేస్తున్నారు. ఈ చాలెంజ్ లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్లకు అనుగుణంగా ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకొని పూర్తి చేయవచ్చు.

 

Do you have enough food .. but if you own a bullet .. see how it is ..

1.ఆప్షన్ -1
మొదటి ఆప్షన్ రూ. 4444 విలువైనా పెద్ద బుల్లెట్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక గంట సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది అలా తిన్నవారు పూర్తి ఉచితంగా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ ను ఇంటికి తీసుకువెళ్ళవచ్చు

2. ఆప్షన్ -2
ఒక్కరే ఈ పోటీలో పాల్గొనాలి అనుకుంటే రూ. 2500 విలువైనా చిన్న బుల్లెట్ ప్లేట్ ను కొనుగోలు చేసి, ఈ ప్లేట్ ను కూడా ఒక గంట సమయంలోనే పూర్తిగా ఫినిష్ చేయాలి అలా చేసిన వ్యక్తి ఉచితంగా కొత్త ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ నువ్వు గెలుచుకోవచ్చు.

పూణేలోని ఓల్డ్ ముంబై – పూణే హైవే వద్ద ఈ హోటల్ శివరాజ్ అనే రెస్టారెంట్ ఉంది. సోలాపూర్ జిల్లాకు చెందిన సోమనాథ్ పవర్ ఆర్ అనే వ్యక్తి ఈ స్పెషల్ బులెట్ థాలి ని నిర్ణీత సమయంలో ఫినిష్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను గెలుచుకున్నాడు రెస్టారెంట్ యజమాని తెలిపారు.


Share

Related posts

కన్నకొడుకు భార్యను పెళ్లి చేసుకున్న మామ.. ట్విస్ట్ ఏంటంటే?

Teja

Second Heart: మన శరీరం లో గుండె కంటే ముఖ్యమైన భాగం ఒకటి ఉంది .. ఇది తేడా వస్తే స్పాట్ డెత్ !

bharani jella

భారత్ 622/7 డిక్లెర్

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar