స్టార్ మా ఛానల్ లో గత రెండు సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’ అనే సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించింది. ఆ సీరియల్‌లో ముఖ్యంగా వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ నటన అందరినీ ఆకర్షిస్తోంది. ఇంత క్రేజ్ కార్తీక దీపం సీరియల్‌కి రావడానికి ముఖ్య కారణాలలో ప్రేమి విశ్వనాథ్ నటన కూడా ఉంది.
వంటలక్క ఈ సీరియల్‌లో తన పిల్లలను ప్రాణంగా చూసుకుంటుంది. అటువంటి వంటలక్క కి నిజజీవితంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా? ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే ప్రేమి విశ్వనాధ్ ఎప్పుడు తన పిల్లలకు, తన కుటుంబానికి సమయం కేటాయిస్తుంది? ఇటీవల ఆమె ఈ విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. వినీత్ భట్ అనే ప్రముఖ ఆస్ట్రాలజర్ ని వివాహం చేసుకున్న ప్రేమి విశ్వనాథ్‌కి ఒక బాబు ఉన్నాడు. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన తల్లి దగ్గర ఆ బాబు ఉంటున్నాడని ఆ బాబు ఆలనాపాలనా అంతా తన అమ్మ చూసుకుంటుందని ప్రేమి చెప్పుకొచ్చారు. ఇక్కడ షూటింగ్‌లతో ఎప్పుడు బిజీ గా ఉండే మీరు మీ బాబు ని మిస్ అవ్వరా అని అడగగా దానికి ఆమె చెప్పిన సమాధానానికి నెటిజన్స్ ఫిదా అయిపోయారు.
“అదేమి లేదు ఎందుకంటే బాబు ఉన్నదీ మా అమ్మ దగ్గరే కదా. అయినా చూడాలనిపించినప్పుడు వీడియో కాల్స్ కూడా ఉన్నాయి అందుకేనేమో మిస్ అవుతున్నట్లు అనిపించిదు. ఫ్యామిలీ కోసం ఒక వారం హైదరాబాద్‌లో అలాగే మరోవారం కేరళలో గడుపుతుంటాను” అని ప్రేమి తెలిపింది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్‌లో నటిస్తోన్న ప్రేమి విశ్వనాధ్ త్వరలో వెండితెరపైనా కూడా కనిపించనుంది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…