Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొత్తం ఎన్ని రీమేక్ సినిమాలు చేశారో తెలుసా..??

Share

Pawan Kalyan: చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ టైమ్ లోనే తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మెగాస్టార్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ స్థాయి అందుకున్న హీరోగా పవన్ కళ్యాణ్ మెగా అభిమానులను ఎంతగానో అలరించాడు. కెరియర్ పరంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న పవన్… సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రారంభంలో వరుస విజయాలు అందుకోవడం జరిగింది. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా నుండి “ఖుషి” వరకు చాలావరకు సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ లు. ఆ తర్వాత జానీ నుండి ఇ వరుస ఫ్లాపుల అందుకున్న పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా దాదాపు పది సంవత్సరాల పాటు సరైన హిట్టు లేకుండా.. గడ్డుకాలం చూడటం జరిగింది.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన రీమేక్ సినిమాలు ఇవే | Pawan Kalyan remake movies  list

ఇదిలా ఉంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ అభిమానులు భారీ ఎత్తున వేడుకలు జరుపుతున్నారు. ఎక్కడికక్కడ కటౌట్లు కడుతూ.. పాలాభిషేకాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక అభిమానులు మాత్రమే కాక జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమా రంగంలో దూసుకుపోతున్న పవన్.. ఇండస్ట్రీ పరంగా సినిమాలు చాలా వరకు రీమేక్ సినిమాలను.. పవన్ చేయటం తెలిసిందే. ఇప్పటివరకు 26 సినిమాలు చేయగా వాటిలో ఎక్కువగా రీమేక్ సినిమాలే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ సినిమాల లిస్ట్ పై ఓ లుక్ ఏద్ధం. రీమేక్ స్పెషలిస్టుగా.. ఇండస్ట్రీలో పేరు సంపాదించిన పవన్.. ప్రస్తుతం నటిస్తున్న “భీమ్ల నాయక్” మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పునుమ్ కోశియుమ్.

 

ఇంకా లిస్ట్ చూస్తే.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్ -బాలీవుడ్ ఇండస్ట్రీ లో పింక్ సినిమా రీమేక్, కాటమ రాయుడు – వీరమ్, ఓ మై గాడ్ – గోపాల గోపాల, గబ్బర్ సింగ్ – దబంగ్, లవ్ ఆజ్ కల్ – తీన్‌మార్, తిరుపాచ్చి – అన్నవరం, ఖుషీ – ఖుషీ, జో జీతా వహి సికిందర్ – తమ్ముడు, లవ్ టుడే – సుస్వాగతం, గోకులంలో సీత – గోకులతిల్ సీతై, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – ఖయామత్ సే ఖయామత్ తక్. చాలావరకు వీటిల్లో తమిళం లో.. విజయ చేసిన సినిమాలు తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొన్ని సినిమాలు.. పవన్ తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని సినిమాలు పవన్ సౌత్ ఇండస్ట్రీ లో మలయాళంలో తెరకెక్కిన సినిమాలు రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.


Share

Related posts

Mansas Trust: అశోక్ గజపతి రాజుపై విజయసాయి రెడ్డి ఎంతమాట అనేశాడు..!!     

somaraju sharma

ఏంటి సమంత? ఒక్క గంటకు నిర్మాత అన్ని లక్షలు ఇస్తున్నారా?

Teja

Anupama Parameswaran Saree images

Gallery Desk