డోనాల్డ్ ట్రంప్’కు పెన్షన్ ఎంత ఇస్తారో తెలుసా?

Share

ఈ ఎన్నికల్లో ట్రంప్ ప్రజలపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. తన నిర్ణయం తప్పు అంటూ ప్రజలు వాళ్ల ఓటుతో నిరూపించారు. మళ్లీ నేనే గొలుస్తానని అతనిపై అతను పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులుగా మారతాయని అతడు కూడా ఊహించుండడేమో.. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఏడుకోట్లకు పైగానే ఓట్లను సంపాధించుకున్నారు. కాని ఏం లాభం ఎన్ని నోట్లు గెలుచుకున్నా పరాజయాన్ని మాత్రం చవిచూడకతప్పలేదు. కాగా అమెరికాలో అత్యధిక ఓట్లు నమోదుచేసుకున్న అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలవడం విశేషం. అలాగే ఈయన పాలనకు ముగ్దులైన వారు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవచ్చు. కాని ఆయన దుందుడుకు చేతలతో ప్రజల నుంచి విముకత ను ఎదుర్కొన్నారు. కాగా ఆయన పరిపాలన మీదే ఆయన విజయం కూడా దాగుందనే విషయాన్ని మర్చిపోయి నేనే గెలుస్తాననే ఓవర్ కాన్ఫిడెండ్ పెట్టుకున్నట్టున్నారు ట్రంప్. అందుకు నిదర్శనంగా అతను ఓటమిని కూడా చవిచూశారు. ఇంకేముంది డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి డెమొక్రటిక్ పార్టీ నుంచి విజయం సాధించిన జో బైడెన్ సిద్ధమవుతున్నారు.

ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనార్డ్ ట్రంప్ ను ఓటమిపాలు చేసిన జో బైడెన్ 2021 జనవరి 20 న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అప్పటి వరకు ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సి ఉంది. దేశ అధ్యక్ష పదవి స్వీకరించి సేవలు అందించిన వారికి అమెరికా ప్రభుత్వం పెన్షన్ ను అందిస్తుంది. అంటే వారు ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి, సిబ్బందిని పెట్టుకోవడానికి, ఇతరత్రా సేవలను అందించడానికి అమెరికా పెన్షన్ ను అందిస్తుంది.

ఈ విధానాన్ని కార్నెగ్ అనే పారిశ్రామిక వేత్త 1912 లో మాజీ అధ్యక్షులకు ఆర్థిక సాయం చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మాజీ అధ్యక్షుల చట్టాన్ని ప్రభుత్వమే అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాదికి 2,19,200 డాలర్ల పెన్షన్ ను పొందుతారు. అంటే దాదాపుగా రూ.1.6 కోట్లు అన్నమాట. మాజీ అధ్యక్షునితో పాటుగా అతని జీవిత భాగస్వామికి కూడా సంవత్సరానికి 20 వేల డాలర్లు అందిస్తారు. అలాగే వీరికి చట్టం ప్రకారం పెన్షన్, సిబ్బంది కేటాయింపు, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి.


Share

Related posts

Cauliflower: క్యాలీఫ్లవర్ ను వీళ్ళు తింటే విషంతో సమానమట..!! ఎందుకంటే..!?

bharani jella

న్యాయవాదుల నిరసన

somaraju sharma

ఇప్పటి వరకు చేస్తున్న సినిమాలకంటే పదిరెట్లు గొప్ప అవకాశం అందుకున్న కీర్తి సురేష్..!

GRK