NewsOrbit
న్యూస్

తిరుమల వెంకన్న ఆస్తులు ఎంతో తెలుసా? : జగన్ ఇదో మైలేజ్ పాయింట్

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )

తిరుమల వెంకన్న ఆస్తులు ఎంతో తెలుసా? ట్రావెన్ కోర్ ఆలయం కంటే తిరుమల ధనికమా? ఎంత భూములు ఉన్నాయి? ఎన్ని స్థలాలు ఉన్నాయి? అనేది ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. తిరుమల వెంకన్న కు ఉన్న ఆస్తులు ఎంతో ఒకసారి తెలుసుకుందాం రండి..

బోర్డు వచ్చాకే లెక్కలు

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఎందరో రాజులు శ్రీనివాసుడికి ఎన్నో కానుకలు, ఆస్తులను రాసిచ్చారు. అయితే రాజుల కాలంలో ఇచ్చిన ఆస్తులకు లెక్క పక్కా లేకపోవడంతో అవి నిరర్ధకమయ్యాయి. 1932 లో మహంతుల పాలన తర్వాత మొదటిసారి టీటీడీ పాలకమండలి ఏర్పడిన దగ్గర నుంచి స్వామి వారి ఆస్తులపై పర్యవేక్షణ, లెక్కలు మొదలయ్యాయి. ఇటీవల తిరుమల వెంకన్న నిరర్ధక ఆస్తుల ను వేలం వేసి వాటి ద్వారా వచ్చే రాబడిని తీసుకోవాలని టిటిడి భావించింది. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఆస్తులను ఎలా వేలం వేస్తారని ఇలా అనుకుంటూ పోతే టీటీడీ వెంకన్న ఆస్తులు ఏమి మిగలవు అంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. అయితే అసలు వెంకన్న కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? వున్న స్థిరాస్తుల ఎంత చరాస్తుల ఎంత అన్ని వివరాలు సగటు భక్తుడికి ఆసక్తి కలిగించాయి.

ఇవి ఆస్తులు

*వెంకన్న మొత్తం ఆస్తులు : 1128
*మొత్తం భూమి : 8808 ఎకరాల 89 సెంట్లు
*వ్యవసాయ ఆస్తులు : 233
* వ్యవసాయ భూమి : 2085 ఎకరాల 41 సెంట్లు
* వ్యవసేయేతర ఆస్తులు : 895
* వ్యవసాయేతర భూమి : 6003 ఎకరాల 48 సెంట్లు

1974 నుంచి ఆస్తులు అమ్ముతున్నారు

వైసీపీ పాలన లోనే టిటిడి ఆస్తులు అమ్ముతున్నారు అంటూ విపక్షాలు చేసిన యాగీ పూర్తిగా రాజకీయం. గత టీడీపీ హయాంలోనూ టిటిడి బోర్డు కొన్ని తీర్మానాలు చేసి ఆస్తులను అమ్మింది. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో లేక వాటిని కాపాడుకోలేక 1974 నుంచే ఆస్తులను అమ్ముతూ వస్తున్నారు. వచ్చిన డబ్బులు టీటీడీకి జమ చేస్తున్నారు. ఇదేమి కొత్తది కాదు. 1974 నుంచి 2014 వరకు టీటీడీ అమ్మిన ఆస్తులు 141. అమ్మేసిన భూమి 335 ఎకరాల 23 సెంట్లు. దీనిలో వ్యవసాయ భూమి 293 ఎకరాల 02 సెంట్లు. వ్యవసాయేతర భూమి 42 ఎకరాల 21 సెంట్లు. దీని వల్ల వచ్చిన ఆదాయం 6.13 కోట్లు. ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న ఆస్తులు 987. భూమి 7753 ఎకరాల 66 సెంట్లు. దీనిలో వ్యవసాయ ఆస్తులు : 172 అయితే వ్యవసాయ భూమి : 1792 ఎకరాల 39 సెంట్లు. వ్యవసాయేతర ఆస్తులు 815 ఉంటే భూమి 5961 ఎకరాల 27 సెంట్లు ఉంది.

చరిత్ర రాసిన బోర్డు

జగన్ బాబాయ్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న టీటీడీ పాలకమండలి చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని వెంకన్న ఆస్తులను బహిర్గతం చేసింది. టీటీడీ ఆప్తులు పై విడుదల చేసిన శ్వేత పత్రం నిజంగా అద్భుతం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఈ బోర్డు చేయని పనిని జగన్ ప్రభుత్వం చేసి చూపించింది. ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ప్లస్ అయ్యేది. అయితే దీనిపై కనీసం ఒక ప్రెస్ మీట్ గాని, లేదా సోషల్ మీడియాలో టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆశిస్తూ ప్రమోషాన్ కానీ లేకపోవడం విశేషం. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం సైతం దీన్ని చర్చకు లేపేలా ప్రచారం కల్పించలేదు.

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!