NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

ఏడుపు వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

మన కళ్ల నుంచి కన్నీరు కేవలం మనం ఏడ్చినప్పుడు మాత్రమే కాకుండా, మనసు బాధ పడినప్పుడు, లేదా ఏదైనా గాయం తగిలినప్పుడు, దుమ్ము ధూళి వంటి పదార్థాలు మన కంటిలో పడినప్పుడు కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంటాయి. అయితే మన ఇళ్ళల్లో కొందరు చిన్న చిన్న విషయాలకే బాధపడే కళ్ళ వెంబడి నీరు పెట్టుకుంటారు. వారిని చూస్తే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు, ఇలా ఏడవడం ఇంటికి చాలా అరిష్టమని చెబుతారు. కానీ నిజానికి ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని మీకు తెలుసా? మనం ఏడ్చినప్పుడు కళ్ల నుంచి నీరు కారడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతామో, ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా మన కళ్ళ వెంబడి మూడురకాల కన్నీరు బయటికి వస్తాయి అందులో ఒకటి బాసల్ టియర్స్, వీటినే కళ్లను శుభ్రం చేస్తే కన్నీరు అని కూడా పిలుస్తారు. ఈ కన్నీరు నిమిషానికి దాదాపుగా రెండు మైక్రో లీటర్ల దాకా ఉత్పత్తి చేస్తాయి. ఇది మన కంటిలో ఉండటంవల్ల మన కళ్ళు ను ఎప్పుడూ తేమగా ఉంచడమే కాకుండా, కళ్ళల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ల నుంచి మన కళ్ళను కాపాడుతాయి.
రెండవది రిఫ్లెక్స్ టియర్స్ ఈ కన్నీళ్లు మనం బయటికి వెళ్లినప్పుడు మన కళ్లల్లో దుమ్ము ధూళి పడినప్పుడు లేదా ఇంట్లో ఉల్లిపాయలను కోసేటప్పుడు మన కళ్ళలో నుంచి ఈ కన్నీరు కారుతాయి. ఇలా ఈ కన్నీరు కారడం వల్ల దుమ్ము, ధూళి కణాలను, మంటల నుంచి మన కళ్ళను కాపాడుతాయి.

మూడవ రకం కన్నీళ్లను భావోద్వేగ కన్నీళ్లు లేదా ఎమోషనల్ టియర్స్ అని పిలుస్తారు. కొంతమంది కొన్ని సంఘటనలకు ఎంతో భావోద్వేగానికి గురవుతుంటారు. ఈ కన్నీళ్లు బయటకు రావడం వల్ల మన మనసులో ఉన్న బాధ తొలగిపోయి, మనసు తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ భావోద్వేగానికి గురై ఏడుస్తున్నప్పుడు వారిని కొద్దిసేపు ఇవ్వండి అని అనడం వినే ఉంటారు. అలా ఏడవడం వల్ల వారిలోనే ఒత్తిడి మొత్తం తగ్గిపోయి, వారి మనసులో ప్రశాంత వాతావరణం సంతరించుకుంటుంది. ఎక్కువ సేపు ఏడవటం వల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్,ఎండోజెనస్‌ ఒపియడ్స్‌ ఎక్కువగా విడుదల అవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయని,యేలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju