కోడి గుడ్డు పెంకులతో ఇంటి గార్డెన్’లో ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

పచ్చదనాన్ని పరిశుభ్రంగా ఉంచితే మనల్ని మనం రక్షించుకునట్లే. వాతావరణం పచ్చగా ఉండటం కోసం మొక్కలు నాటే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతుంది. తన ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దేందుకు మొక్కలు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ మొక్కల పెరుగుదల పై మరింత శ్రద్ధ పెట్టడం వల్ల మన ఇంటికి పరిసరాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ మొక్కలు పెరగడానికి ఎన్నో ఫర్టిలైజర్ అందుబాటులో ఉన్న, మన కిచెన్ లో దొరికే వాటితో ఈ మొక్కలను ఎంత అద్భుతంగా పెంచవచ్చు.

Hands are holding composted earth.

అరటి తొక్కలు: అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా లభించడం వల్ల ఈ అరటితొక్కలను మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగించవచ్చు. తిని పడేసిన అరటి తొక్కలను చిన్న ,చిన్న ముక్కలుగా కట్ చేసి కుండీలో వేయడం ద్వారా మొక్కకు తగినంత పొటాషియం అందుతుంది.

కోడిగుడ్డు పెంకు: సాధారణంగా కోడిగుడ్డు అధిక ప్రొటీన్లతో నిండి ఉంటుంది. కోడి గుడ్డు పెంకులో కూడా ఎక్కువ శాతం క్యాల్షియం ఉండటం ద్వారా మొక్కలు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తాయి.కోడి గుడ్డు పెంకులను బాగా క్రిష్ చేసి చెట్టు మొదలు దగ్గర వేయడం ద్వారా చెట్లు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీని తయారు చేసుకోవడానికి గ్రీన్ టీ బ్యాగులను వాడుతుంటారు. ఆ బ్యాగును తిరిగి రెండు లీటర్ల నీటిలో కలిపి రెగ్యులర్ గా చెట్ల పోయడం ద్వారా చెట్లకు కావల్సినంత న్యూట్రియన్స్ లభిస్తాయి.

ఉల్లి, వెల్లుల్లి తొక్కలు: మన కిచెన్ లో వేస్ట్ గా ఉన్న ఉల్లి, వెల్లుల్లి తొక్కలను చెట్లకు ఫర్టిలైజర్ గా వాడటం ద్వారా చెట్లకు మంచి పోషణ లభిస్తుంది. ఈ ఉల్లి, వెల్లుల్లి తొక్కలను నీటిలో బాగా నానబెట్టి ఆ నీటిని మరుసటిరోజు చెట్లకు పోయడం ద్వారా చెట్లకు తగినంత పోషకాలు లభిస్తాయి. ఈ విధంగా మన కిచెన్ లో నుంచి లభించే పదార్థాలను మొక్కలకు మంచి ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు.