Blob: హిందూ సంప్రదాయం
బొట్టు పెట్టటం అనేది మర్యాదకి గుర్తు. కాబట్టి ఎవరినైనా ఆహ్వానించాలి అని అనుకున్నప్పుడు ముందుగా బొట్టు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి పంపడం హిందూ సంప్రదాయం.
బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి? ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతికలుగుతుంది. మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో నుదుటున బొట్టు పెట్టుకోవడం వలన ముక్తి సిద్ధిస్తుంది అని ఆధ్యాత్మిక నిపుణులు తెలిసిచ్చేస్తున్నారు.
Blob: బొట్టు మంత్రం
బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ మంత్రం స్మరించుకోవాలి..
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని అమ్మవారిని స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం అని గుర్తు పెట్టుకోండి. కనుబొమ్మల మధ్య జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి కేంద్రం గా భావిస్తాం కాబట్టి అక్కడ బొట్టు పెట్టుకుంటాము. మరో వాదన ప్రకారం బ్రహ్మ స్థానం నుదురుగా భావిస్తారు. అందుకే అక్కడ బొట్టు పెట్టుకుంటే.. బ్రహ్మను పూజించినట్లు అవుతుందని కూడా అంటుంటారు. ఇక ఆరోగ్యపరం గా చూస్తే, కుంకుమ బొట్టుపై సూర్యకాంతి పడడం వలన శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. కొన్ని సమయాలలోగంధం , విభూతి తో కూడా బొట్టు పెట్టుకోవడం మంచిది.
మగవారు
ఆడవారు మాత్రమే కాదు..ధర్మాన్నిపాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి సంకేతం గా మగవారు బొట్టు పెట్టుకోవడం అనేది ఉంటుంది. .నుదుటున బొట్టు పెట్టుకోవడం అనేది మూఢాచారం ఎంతమాత్రం కాదు. పెద్దలు, మనకోసం చెప్పిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది కేవలం భారతీయులకే ప్రత్యేకమైనది.