మన దగ్గర సూర్యుడు ఉదయం 6 గంటలకే పరిగెత్తుకు వస్తాడు. కానీ అక్కడ మాత్రం 12 గంటలైనా ముసుగు తీయడు మధ్యాహ్నం మూడు గంటలైతే మళ్లీ పొగమంచు చాటుకు జారుకుంటాడు. చలితో వణికించేలా చేస్తాడు. పట్టపగలు చలి మంటల్లో సేద తీరాల్సిందే. వేసవిలోనూ ఈ వింత వాతావరణం లంబసింగి సొంతం. కాశ్మీర్‌ను తలపించే ఆ ఆంధ్ర కాశ్మీరును తనివితీరా చూడాల్సిందే.
విశాఖ వెళ్లే ప్రతి పర్యాటకుడు తప్పక చూడాలనుకునే ఊరు లంబసింగి. అక్కడి అందాలు కట్టిపడేస్తాయి మంచి దుప్పట్లు కప్పుకొన్న ప్రకృతి కనువిందు చేస్తుంది .దట్టమైన అడవి పచ్చని కొండకోనలు వాటిమీద సేదతీరినట్లు ఉండే పల్లెలు ఆ అపురూప దృశ్యాలు చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ప్రకృతి కనువిందు చేస్తుంది. ఒకసారి ఆ ప్రాంతానికి వెళితే జీవితానికి సరిపడా మధురానుభూతులను వెంట తెచ్చుకోవచ్చు.
లంబసింగి గాలిని సైతం గడ్డకట్టించే చలి, దట్టమైన పొగమంచు, హీమతుంపర్లు,అతి చల్లని గాలులు, పూల సొగసులు. చలికాలం వచ్చిందంటే ఈ ఆంధ్ర కాశ్మీర్ అందాలు చూడాల్సిందే. దట్టంగా కురుస్తున్న మంచుతో మరింత అందంగా కనిపిస్తుంది. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. శీతాకాలంలోనే కాదు మిగతా కాలంలో కూడా ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందంటే ఈ గిరి పల్లె ఎంతలా వణికిస్తుందో ఊహించవచ్చు. అక్టోబర్ నుంచి వరకు ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తుంది. లంబసింగిలో మంచు కదులుతున్న దృశ్యాలు ప్రజలను కట్టిపడేస్తున్నాయి. దానికి తోడు ఏజెన్సీ ప్రాంతాలు లో సాగుచేస్తున్న వలసి తోటలు మరింత అందాన్ని పెంచాయి. వేసవిలో ఆంధ్రప్రదేశ్ అంతా వేడి గాలులు వేస్తుంటే లంబసింగిలో మాత్రం చలికాలాన్ని తలపిస్తుంది. అందుకే దీనిని ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. స్థానికులకు చలి వణికించిన పర్యాటకులకు మాత్రం విశేషంగా ఆకర్షిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం అందమైన ప్రదేశాలుకు టూరిస్టులు మైమరచిపోతారు. ఏమని వర్ణించగలం ఎంతని వివరించగలం అయినా ఎంత తవ్వినా తరగని గని ఇది. అయినా లంబసింగి ప్రకృతి ఇ అందాల గురించి చెప్పుకుంటూ పోతే కవుల కలానికి హద్దులెక్కడ. ఒక్కసారి అక్కడికి వెళ్లి సోయగాలను తనివితీరా ఆస్వాదిస్తే ఆ ఆనందమే వేరు మీరు వెళ్లే ప్రదేశాలలో లంబసింగి మర్చిపోకండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?