Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలా మందికి సెంటిమెంటు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాఘవేంద్రరావు కి పళ్ళు.. పవన్ కళ్యాణ్ కి ఎంట్రన్స్ టైంలో గ్రద్ధ..డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాల్లో హీరోలు ఎక్కువ గడ్డాలు పెడుతుంటారు..డైరెక్టర్ రాజమౌళి ప్రతి సినిమాలో కొత్త ఆయుధం చూపిస్తారు. ఈ రకంగా ఇండస్ట్రీలో పలు డైరెక్టర్లకు.. నిర్మాతలకు సెంటిమెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ రీతిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న అసలు సిసలైన సెంటిమెంట్ తాజాగా బయటపడింది. విషయంలోకి వెళితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రారంభంలో కెరీర్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న టైములో.. ఒక గదిలో ఉండగా వరుస అవకాశాలు అందుకోవడం తో ఆ రూమ్ రెంట్ ఇప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కడుతున్నారట. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభంలో పంజాగుట్ట దగ్గర చాలా చిన్న రూమ్ లో త్రివిక్రమ్ ఉండేవారట. త్రివిక్రమ్ తో పాటు సునీల్ కూడా ఇదే రూమ్ లో ఉండటం జరిగిందట.
ఇద్దరికీ ఆ రూమ్ చాలా సెంటిమెంట్ అని హైదరాబాద్ వచ్చిన ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో.. ఆ గది లోకి దిగిన తర్వాత వరుస అవకాశాలు అందుకోవడం తో త్రివిక్రమ్ కి ఆ గాది సెంటిమెంట్ గా మారిపోయిందట. దీంతో ఇండస్ట్రీ లో ఎంత బిజీగా ఉన్నా గాని.. నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇంటి ఓనర్ కి కచ్చితంగా ఎక్కడున్నా కట్టేస్తారట. దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ రీతిగా డబ్బులు కడుతూ.. ఉన్నారట. రూమ్ ఖాళీగా అనేకమందికి కనిపించిన తరుణంలో చాలామంది.. ఎక్కువ డబ్బులు ఇస్తాము మాకు ఆరు మధ్య ఇవ్వండి అంటూ ఓనర్ ని అడిగిన.. ఓనర్ త్రివిక్రమ్ సెంటిమెంట్ కాదనలేక ఎక్కువ రెంట్.. వచ్చే అవకాశాన్ని వదులుకుంటన్నారట.
ఈ క్రమంలో ఒక వ్యక్తి సెంటిమెంట్ తానుకూడా గౌరవిస్తాను అని ఆ ఇంటి ఓనర్ అంటున్నారట. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఫ్రీగా ఉన్న సమయంలో తన మిత్రులతో కుదిరితే సునీల్ తో కలిసి.. అప్పుడప్పుడు గడుపుతుంటారు అట. అప్పట్లో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను అదే రీతిలో అనేక అనుభూతులను.. త్రివిక్రమ్ తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు ఆ గదిలోకి వెళ్లి నెంబర్ వేసుకుంటారు అంట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో.. త్రివిక్రమ్ కి మరి ఇంత సెంటిమెంటా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.