జనతా గ్యారేజ్ ఈ సినిమాలో ముందుగా గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరవాత ఈ సినిమాలో విలన్‌గా నటించిన మలయాళీ యాక్టర్ ఉన్ని ముకుందన్. ఆ విలన్ భాగమతి సినిమాలో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈయనకు బైకులు అంటే క్రేజ్ ఎక్కువ. మార్కెట్ లోకి వచ్చే మోడల్ బైక్ లను కొనుగోలు చేస్తుంటాడు. ఉన్ని ఇటీవల లగ్జరీ డుకాటీ పానిగల్ వి 2 బైక్ ను కొనుగోలు చేశారు. భారత మార్కెట్లో అమ్ముడవుతున్న సూపర్ బైక్ లో డుకాటీ పానిగల్ వి 2 ఒకటి. ఉన్ని ముకుందన్ వద్ద ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జి టి, క్లాసిక్ డస్టర్ స్టార్మ్ , జావా పెరాక్, పల్సర్ వంటి బైకులు ఉన్నాయి. వీటితో పాటు లగ్జరీ డుకాటీ పానిగల్ వి 2 బైక్ తన గ్యారేజీలో లో చేరింది.
ఈ లగ్జరీ బైక్ పూర్తి విశేషాలు ఇలా ఉన్నాయి..
ఈ బైక్ ధర కేరళలో రూ.24 లక్షలు. ఇది దేశంలో మొట్టమొదటి బీఎస్-6 ఇన్స్పైర్డ్ డుకాటీ పానిగల్ వి 2 సూపర్ బైక్. 950cc సూపర్ క్వాడ్రో 90 డిగ్రీ విటు ఇంజన్ ఉంది. లగ్జరీ డుకాటీ పానిగల్ వి 2 10750 ఆర్ పి ఎమ్ వద్ద 155 బి హెచ్ పి నా శక్తిని ఇస్తుంది. 9000 ఆర్ పి ఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ పిక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేశారు. ఫ్రెంట్ ఫెయిరింగ్, సింగిల్ సైడ్ స్వింగార్మ్ లతో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇందులో సిగ్నేచర్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఎయిర్ గేమ్ డామ్, వీ షేప్ డి ఆర్ ఎల్ , ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 4.3 ఇంచెస్ టి ఎఫ్ టి డిస్ప్లే , స్ట్రాంగ్ అండర్ ఎగ్జాస్ట్ కూడా ఉంది.
రాజధాని పోరాటంలో మరో రైతు మృతి